TS EDCET Schedule: బీఈడీ ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్‌సెట్ షెడ్యూలు విడుదలైంది. ఈనెల 7 నుంచి జూన్ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఎడ్‌సెట్ కన్వీనర్ ఎ.రామకృష్ణ తెలిపారు. ఆలస్య రుసుము 250 రూపాయలతో జులై 1 వరకు 500 రూపాయలతో జులై 15 వరకు దరఖాస్తులు చెల్లించవచ్చునన్నారు. ఎస్సీ, ఎస్టీలు 450 రూపాయలు ఇతరులు 650 రూపాయల రుసుము చెల్లించాలి. జులై 26, 27 తేదీల్లో తెలంగాణ, ఏపీల్లో ఎడ్‌సెట్ నిర్వహించనున్నారు.
రాష్ట్రంలో 220 బీఈడీ కాలేజీల్లో 19 వేల 600 సీట్లు అందుబాటులో ఉన్నాయి. డిగ్రీ, ఇంజినీరింగ్ 50శాతం మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఎడ్‌సెట్‌కు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు 40శాతం మార్కులు ఉంటే చాలని కన్వీనర్ తెలిపారు. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ప్రవేశ పరీక్ష రాయవచ్చునన్నారు. ఎంబీబీఎస్, బీఫార్మసీ, అగ్రికల్చర్ బీఎస్సీ వంటి వృత్తివిద్యా కోర్సులు చదివిన వారు బీఈడీకి అనర్హులని కన్వీనర్ తెలిపారు.
పూర్తి వివరాల కోసం https://edcet.tsche.ac.in, http://www.tsche.ac.in వెబ్‌సైట్‌లో మరిన్ని వివరాలు పరిశీలించవచ్చన్నారు. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి, ఉపాధ్యక్షుడు వెంకటరమణ, కన్వీనర్ రామకృష్ణ, కోకన్వీనర్ శంకర్ ఎడ్‌సెట్ షెడ్యూలు విడుదల చేశారు.
ఇదీ చూడండి: