ETV Bharat / state

నేడు ఎంసెట్​ అగ్రికల్చరల్​ పరీక్ష.. క్లాట్​, నైపర్​ జేఈఈ కూడా.. - niper jee

నేడు, రేపు రెండు రోజుల పాటు ఎంసెట్​ అగ్రికల్చర్​ పరీక్ష జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 84 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతంలో ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ విభాగాలకు ఒకే దఫాలో నిర్వహించగా... ఈ ఏడాది కరోనా పరిస్థితుల కారణంగా.. వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. జాతీయ పరీక్షలు క్లాట్​ నైపర్​ జేఈఈ పరీక్షలు కూడా నేడు జరగనున్నాయి

ts eamcet agricultural exam today
నేడు ఎంసెట్​ అగ్రికల్చరల్​ పరీక్ష
author img

By

Published : Sep 28, 2020, 5:04 AM IST

ఎంసెట్ అగ్రికల్చర్ విభాగం పరీక్ష నేడు, రేపు జరగనుంది. రోజుకు రెండు పూటలు ఆన్​లైన్ పరీక్ష ఉంటుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు.. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు పరీక్ష జరగనుంది. తెలంగాణలో 67, ఏపీలో 17 కలిపి మొత్తం 84 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసినట్లు కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు. రెండు రాష్ట్రాల నుంచి 78 వేల 970 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ విభాగాలకు ఒకే దఫాలో నిర్వహించేవారు. ఈ ఏడాది కరోనా పరిస్థితుల కారణంగా.. వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. ఇంజినీరింగ్ విభాగం ఎంసెట్ ఈ నెల 9 నుంచి 14 వరకు పూర్తి చేసిన జేఎన్​టీయూహెచ్.. ఇవాళ, రేపు అగ్రికల్చరల్ విభాగం పరీక్షకు ఏర్పాట్లు చేశారు. కరోనా నివారణ జాగ్రత్తలన్నీ తీసుకున్నట్టు కన్వీనర్ తెలిపారు. కరోనా లక్షణాలు లేవని విద్యార్థులు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. విద్యార్థులు కచ్చితంగా మాస్క్ ధరించాలని.. శానిటైజర్, మంచినీటి బాటిల్ తెచ్చుకునేందుకు అనుమతిస్తామని కన్వీనర్ తెలిపారు.

క్లాట్​, నైపర్​ జేఈఈ పరీక్షలు కూడా నేడే..

మరో వైపు దేశవ్యాప్తంగా ఉన్న న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి కామన్​ లా అడ్మిషన్​ టెస్టు(క్లాట్​) కూడా నేడు జరగనుంది. దీనికి దేశవ్యాప్తంగా 77వేల మంది హాజరుకానున్నారు. ఇంకా ఫార్మా విద్యకు పేరుపొందిన జాతీయ ఫార్మా విద్య, పరిశోధన సంస్థ(నైపర్లు)ల్లో ఎంబీఏ, ఎంటెక్​ కోర్సుల్లో ప్రవేశానికి దేశవ్యాప్తం నైపర్​ జేఈఈ పరీక్ష కూడా సోమవారమే జరగనుంది.

ఇవీ చూడండి: సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న 'ఉల్లి' ధరలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.