తెరాస సీనియర్ మహిళా నాయకురాలు ఒకరు శనివారం మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో ఆయన నివాసంలో భేటీ అయినట్లు తెలిసింది. ఆమె గతంలో జడ్పీ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. పార్టీలో రాష్ట్రస్థాయి మహిళా నేతగా ఉన్నారు. గత శాసనసభ ఎన్నికల సమయంలో పార్టీ మారతారని ప్రచారం జరిగింది.
తెరాస తరఫున ఎమ్మెల్సీ పదవితో పాటు నియమిత పదవుల కోసం గతం ఆమె ప్రయత్నించినా.. దక్కలేదు. అసంతృప్తితో ఉన్న సదరు నేత ఈటలను కలిసినట్లుగా తెలుస్తోంది. తాజాగా జరుగుతున్న పరిణామాలపై ఆమె వివరణ కోసం ప్రయత్నించగా స్పందించలేదు.
ఇదీ చదవండి: రెండో డోసుకే పరిమితం చేసినా తీరని టీకా కష్టాలు