ETV Bharat / state

ఆ గుర్తుల విషయంలో ఈసీ స్పందించడం లేదంటూ హైకోర్టుకు తెరాస..!

మునుగోడు ఉప ఎన్నికలో గుర్తులపై తెరాస రేపు హైకోర్టులో పిటిషన్ వేయనుంది. తమ అభ్యంతరంపై ఈసీ స్పందించడం లేదని తెరాస హైకోర్టును ఆశ్రయించేందుకు నిర్ణయించింది.

ఆ గుర్తుల విషయంలో హైకోర్టుకు తెరాస..!
ఆ గుర్తుల విషయంలో హైకోర్టుకు తెరాస..!
author img

By

Published : Oct 16, 2022, 5:29 PM IST

మునుగోడు ఉప ఎన్నికల్లో కారును పోలిన 8 గుర్తులను తొలగించాలంటూ తెరాస న్యాయ పోరాటానికి దిగింది. హౌజ్ మోషన్ విచారణ చేపట్టాలని నిన్న కోరగా.. న్యాయమూర్తి ఇంట్లో అత్యవసర విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో రేపు లంచ్ మోషన్ పిటిషన్ వేయాలని నిన్న నిర్ణయించింది. గుర్తుల జాబితా నుంచి కెమెరా, చపాతీ రోలర్, డోలీ, రోడ్ రోలర్, సబ్బు డబ్బా, టీవీ, కుట్టు మిషన్, ఓడను తొలగించాలని కోరుతూ ఈ నెల 10న ఎన్నికల కమిషన్‌ను తెరాస కోరింది. అయితే ఈసీ నుంచి స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించే ప్రయత్నాలు చేస్తోంది.

గతంలో 2018 ఎన్నికల్లో కారును పోలిన గుర్తుల వల్ల తమ అభ్యర్థులకు నష్టం జరిగిందని తెరాస చెబుతోంది. పలు నియోజకవర్గాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థుల కన్నా.. ఈ గుర్తులతో బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. కారును పోలి ఉన్నందునే వాటికి ఓట్లు పడ్డట్లు స్పష్టమవుతోందని ఈసీకి తెరాస వివరించింది. మునుగోడు, జహీరాబాద్, సిర్పూర్, డోర్నకల్‌లో 2018 ఎన్నికల్లో రోడ్ రోలర్ గుర్తుకు సీపీఎం, బీఎస్పీ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయని ఆ పార్టీ నేతలు తెలిపారు. నర్సంపేట, చెన్నూరు, దుబ్బాక, సిద్దిపేట, ఆసిఫాబాద్, బాన్సువాడ, నాగార్జునసాగర్‌లో కెమెరా గుర్తుకు కూడా బీఎస్పీ, సీపీఎం కన్నా ఎక్కువ ఓట్లు పడ్డాయన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ 8 గుర్తులను తొలగించాలని కోరారు. రేపు లంచ్ మోషన్‌కు అనుమతి కోరి పిటిషన్ వేసేందుకు తెరాస సిద్ధమైంది.

ఇవీ చూడండి..

మునుగోడు ఎన్నికల్లో ఆ గుర్తులు వద్దు.. తొలగించాలంటూ ఈసీ వద్దకు తెరాస

ఖర్గే X థరూర్​.. సోమవారమే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు.. గెలుపెవరిది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.