ETV Bharat / state

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు చేర్చేందుకు తెరాస ప్రణాళిక! - Graduate MLC Election Latest News

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా బోగస్ ఓటర్లను చేర్చేందుకు తెరాస ప్రణాళిక సిద్ధం చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన సమాచారం ఆధారంగా నమోదు చేసే అవకాశం ఉందన్నారు. అధికారులు ఆ మేరకు తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. ఇక గ్రేటర్​లో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్​లో తెరాస, మజ్లీస్​కు లబ్ధి కలిగించేలా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో తెరాస, కాంగ్రెస్, భాజపా, తెదేపా, ఎంఐఎం, సీపీఎం, సీపీఐ నాయకులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.

trs plans to include bogus votes in the MLC election in telangana
బోగస్ ఓట్లు చేర్చేందుకు తెరాస ప్రణాళిక!
author img

By

Published : Oct 3, 2020, 8:15 PM IST

గ్రేటర్​లోని అఖిల పక్షం నాయకులతో జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగం అదనపు కమిషనర్ పంకజ సమావేశం నిర్వహించారు. ఫొటో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ-2021, పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్​పై ఎజెండాగా చర్చించారు. గ్రేటర్​లో ప్రస్తుతం ఉన్న పోలింగ్ కేంద్రాల భవనాలు కూల్చివేయడం వల్ల 72 పోలింగ్ కేంద్రాలను మార్చుటకు.. మరో 16 పోలింగ్ కేంద్రాల పేర్లు మార్పుకు అధికారులు ప్రతిపాదనలు చేశారు.

ప్రతిపాదనలు చేయాలి

కొత్తగా ఏమైనా పోలింగ్ కేంద్రాల లొకేషన్స్​లో మార్పుల గురించి మీ దృష్టిలో ఉంటే వెంటనే ప్రతిపాదనలు చేయాలని అధికారులు కోరారు. ఇది ప్రాథమిక సమావేశం మాత్రమేనని.. ఈ ప్రతిపాదనల గురించి మీ అభిప్రాయాలు తెలియజేయాలని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం నియోజకవర్గాల వారీగా ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారుల ఆధ్వర్యంలో.. రాజకీయ పార్టీలతో మరోసారి సమావేశం నిర్వహించనున్నట్లు జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగం అధనపు కమిషనర్ పంకజ తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో జరిగే సమావేశంలో కూడా మార్పుల గురించి ఇచ్చే ప్రతిపాదనల ప్రతులను కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగంలో ఇవ్వాలని సూచించారు.

ఈవీఎం, బ్యాలెట్ రెండింటితోనూ ముప్పు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓటర్లను నమోదు చేసేందుకు అధికార పార్టీ ప్లాన్ చేస్తోందని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపించారు. అఖిలపక్ష సమావేశానికి హైదారాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రాకపోవడం దారుణమన్నారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని కాంగ్రెస్ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో రిజర్వేషన్లు మారకుండా, ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చే ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గతంలోనే రిజర్వేషన్లు అడ్డగోలుగా జరిగాయని గుర్తుచేశారు. ఈసారి కచ్చితంగా రిజర్వేషన్లు సరి చేయాలన్నారు. ఈవీఎం, బ్యాలెట్ రెండింటితోనూ ముప్పు ఉందన్నారు. నిపుణుల తో చర్చించి దేని ద్వారా తక్కువ నష్టం ఉంటే వాటి ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరారు.

తప్పుడు సమాచారం

గ్రేటర్​లో హిందువుల ఓట్లు ఎక్కువగా ఉన్న చోట.. పోలింగ్ బూత్​లలో సమస్యలు లేవా అని భాజపా నేతలు అన్నారు. పోలింగ్ కేంద్రాల మార్పు విషయంలో జీహెచ్ఎంసీ అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారని అన్నారు. తెరాస, మజ్లీస్​కు లబ్ధి కలిగేలా అధికారులు వ్యవహరిస్తున్నారని.. ఇదీ సరైన పద్ధతి కాదని తెలిపారు. ఓటర్లకు, అనుకూలంగా సౌకర్యాలు ఉండేలా పోలింగ్ బూత్​లను ఏర్పాటు చేయాలని తెరాస నాయకులు పేర్కొన్నారు.

మొత్తం 3,977 పోలింగ్ కేంద్రాలు

ఫొటో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ షెడ్యూల్ గురించి ఎన్నికల విభాగం అదనపు కమీషనర్ పంకజ వివరించారు. 2021 జనవరి 1ని ప్రామాణిక తేదీగా పరిగణిస్తూ ఈ ప్రత్యేక సవరణ జరుగుతుందని వెల్లడించారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. ప్రస్తుతం మొత్తం 3,977 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. మొత్తం పోలింగ్ ప్రాంతాలు 1,586 ఉన్నాయని పేర్కొన్నారు.

ఈ నెల చివరి వరకు

ఫిబ్రవరి 7న పబ్లిష్ చేసిన ఫైనల్ ఎలక్టోరల్ నిబంధనల ప్రకారం హైదరాబాద్ జిల్లాలో మొత్తం 42,37,190 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల రేషనలైజెషన్, హద్దుల మార్పు, తుది పోలింగ్ కేంద్రాల ఆమోద ప్రక్రియ ఈ నెల చివరి వరకు పూర్తి చేస్తామన్నారు. ఫార్మాట్స్-1 నుంచి 8 వరకు వచ్చిన దరఖాస్తులు పరిశీలించి అనుబంధ, ఇంటిగ్రేటెడ్ ముసాయిదా ఓటరు జాబితా తయారు ప్రక్రియను నవంబర్ 1 తేదీ నుంచి 15 వరకు చేస్తామన్నారు. నవంబర్ 16న ఇంటిగ్రేటేడ్ డ్రాఫ్ట్​ పబ్లిష్ చేసి క్లెయిమ్స్, అభ్యంతరాలను.. నవంబర్ 16 నుంచి డిసెంబర్ 15 వరకు తీసుకుంటామని అన్నారు. క్లెయిమ్స్, అభ్యంతరాలు పరిష్కారం 2021 జవవరి 5 వరకు చేసి.. ఫైనల్ పబ్లికేషన్ ఆఫ్ ఎలక్ట్రోరల్ రోల్​ను 2021 జనవరి 15న చేస్తామని వివరించారు.

ఇదీ చూడండి : ఆర్థిక సంక్షోభం పేరిట పాలకవర్గాల శ్రమదోపిడి: ప్రొ.నాగేశ్వర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.