హైదరాబాద్ హైటెక్స్‌లో జరుగుతున్న తెరాస పార్టీ ప్లీనరీకి పెద్ద సంఖ్యలో ఆ పార్టీ శ్రేణులు తరలివెళ్లాయి. విభిన్న రకాల వేషధారణలు, కళాకారులతో పార్టీ కార్యకర్తలు, నాయకులు ర్యాలీగా బయలుదేరారు.
హిమాయత్ నగర్ తెరాస నాయకులు డప్పుచప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, కళాకారులు నృత్యాలతో సందడి చేస్తూ... హైటెక్స్ ప్రాంగణానికి బయలుదేరారు. మరికొందరు కార్పొరేటర్లు.. పార్టీ జెండాలు పట్టుకొని గుర్రాలపై సమావేశానికి చేరుకున్నారు.
ఇదీ చదవండి: TRS Party 20 Years celebrations : తెరాస 20 ఏళ్ల ప్రస్థానం: పోరాట పంథా నుంచి.. ప్రగతి పథంలోకి...