ETV Bharat / state

ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెరాస - telangana varthalu

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను తెరాస అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వరంగల్, నల్గొండ, ఖమ్మం సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో పాటు.. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లో పాగా వేసేందుకు ఎత్తులు పైఎత్తులతో దూసుకెళ్తోంది. ప్రచారానికి మరో 2 రోజులే గడువు ఉండటం వల్ల వ్యూహ, ప్రతివ్యూహాలకు మరింత పదును పెడుతోంది. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా పార్టీ నాయకత్వం ప్రత్యేకంగా జాగ్రత్త పడుతోంది. ప్రతీ 50 ఓటర్లకు ఒక నాయకుడి చొప్పున గులాబీ సైన్యాన్ని మోహరించింది.

ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెరాస

author img

By

Published : Mar 10, 2021, 4:28 AM IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార పార్టీకి సవాల్‌గా మారాయి. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాల నేపథ్యంలో రెండు పట్టభద్రుల స్థానాల్లో గెలుపు, ఓటములు రాజకీయంగా ప్రభావం చూపే అవకాశమున్నందున.. గులాబీ పార్టీ వాటిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండు స్థానాల్లోనూ గులాబీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా తెరాస ఓ వైపు తెరవెనక వ్యూహాలు, మరోవైపు బహిరంగ ప్రచారంలో దూసుకెళ్తోంది. ఓట్ల నమోదు ప్రక్రియ నుంచే తెరాస పకడ్బందీ ప్రణాళికతో కసరత్తు చేసింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులందరినీ భాగస్వామ్యం చేశారు. సమావేశాలు నిర్వహించి పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులతో పాటు.. సాధారణ పట్టభద్రులను చైతన్యపరిచి భారీగా ఓట్లు నమోదు చేయించారు.

వ్యూహాత్మక ఎత్తుగడలతో..

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు నుంచి ప్రచారం వరకు కూడా వ్యూహాత్మక ఎత్తుగడలతో తెరాస దూసుకెళ్తోంది. వరంగల్​-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గంలో సిట్టింగ్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరును చాలా రోజుల క్రితమే ప్రచారంలోకి తీసుకొచ్చింది. ఈ మేరకు పల్లా రాజేశ్వర్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తెజస, భాజపా, కాంగ్రెస్ నుంచి పోటీ ఉన్నప్పటికీ.. వరంగల్-నల్గొండ-ఖమ్మం స్థానం తిరిగి కైవసం చేసుకుంటామని గులాబీ పార్టీ ధీమాతో ఉంది. హైదరాబాద్​-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానాన్ని తెరాస అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భాజపా సిట్టింగ్ స్థానంలో జెండా ఎగరేసే లక్ష్యంతో... వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ప్రత్యర్థుల అంచనాలకు చిక్కని విధంగా, అనూహ్యంగా మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె సురభి వాణిదేవిని తెరాస బరిలోకి దించింది. వాణిదేవిని ప్రకటించిన వెంటనే అన్ని అస్త్రాలను బయటకు తీసి.. విస్తృతస్థాయి ప్రచారం సాగిస్తోంది.

శ్రేణులకు సీఎం దిశానిర్దేశం

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాల నేపథ్యంలో రెండు పట్టభద్రుల స్థానాల్లో గెలుపు, ఓటములు రాజకీయంగా ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో.. తెరాస మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలను లోతుగా విశ్లేషించుకున్న గులాబీ పార్టీ.. అప్పుడు జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతోంది. ఎక్కడా అతి విశ్వాసం ప్రదర్శించకుండా.. ఎక్కడా నిర్లక్ష్యం వహించవద్దని పార్టీ శ్రేణులకు నాయకత్వం పదే పదే చెబుతోంది. తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిరోజూ సమీక్షిస్తూ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ రోజూ వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా సురభి వాణిదేవి గెలుపు బాధ్యతలను కేటీఆర్ భుజాన వేసుకున్నారు. నిరుద్యోగులు, విద్యార్థులు, వైద్యులు, న్యాయవాదులు, మహిళలు, ఇలా విభిన్న రంగాలకు చెందిన పట్టభద్రులతో సమావేశాలు జరుపుతున్నారు.

మంత్రులకు బాధ్యతలు

ఎన్నికలు జరుగుతున్న పట్టభద్రుల నియోజకవర్గాల్లో గులాబీ సైన్యం భారీగా మోహరించింది. ఆయా జిల్లాల్లోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, జెడ్పీ ఛైర్ పర్సన్లు వారి పరిధిలోనే విస్తృత ప్రచారం చేయడంతో పాటు.. కార్యకర్తలను సమన్వయం చేస్తున్నారు. ఇతర జిల్లాల్లోని పార్టీ ముఖ్యనేతలను కూడా తెరాస రంగంలోకి దించింది. పోటీ తీవ్రంగా ఉన్న హైదరాబాద్​-రంగారెడ్డి-మహబూబ్ నగర్ నియోజకవర్గంపై గులాబీ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇతర ప్రాంతాలకు చెందిన మంత్రులను ఒక్కో జిల్లాకు ఇంఛార్జిలుగా కేసీఆర్ నియమించారు. హైదరాబాద్‌కు గంగుల కమలాకర్, రంగారెడ్డికి హరీష్ రావు, మహబూబ్ నగర్​కు వేముల ప్రశాంత్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ముగ్గురు మంత్రులు వారి సొంత జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలను రంగంలోకి దించారు. హైదరాబాద్‌లోని ఒక్కో నియోజకవర్గానికి కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్‌లను ఇంఛార్జిలుగా నియమించారు. హరీష్ రావు నేతృత్వం వహిస్తున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో... మెదక్ జిల్లా ప్రజా ప్రతినిధులు, నేతలు.. ప్రశాంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నిజామాబాద్ శ్రేణులను మోహరించారు. ఇతర జిల్లాల నేతలకు కూడా ప్రణాళికబద్ధంగా నియోజకవర్గాలు, మున్సిపాల్టీలు, మండలాలు, డివిజన్ల వారీగా నిర్దిష్టమైన బాధ్యతలను అప్పగించారు.

జోరుగా ప్రచారం

ఓ వైపు సమావేశాలు, సభలతో ప్రచారం సాగిస్తూ.. మరోవైపు ప్రతీ ఓటరును నేరుగా కలిసి ఓట్లడిగేలా వ్యూహాలు రూపొందించారు. ఎస్​ఎంఎస్​లతో పాటు వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా సందేశాలను పంపిస్తున్నారు. ప్రతీ 50 ఓటర్లకు ఒక స్థానిక నాయకుడిని నియమించారు. పోలింగ్ వరకు కనీసం 4 సార్లు కలిసి ఓట్లడిగేలా ప్రణాళిక చేసుకున్నారు. ఓటరును కలిసి వారి స్పందనను కూడా పార్టీ నేతలకు చేరవేస్తున్నారు. పట్టభద్రుల ఎన్నికల ప్రచారాస్త్రాలను కూడా ఆచితూచి సిద్ధం చేసుకున్నారు. ఎప్పటిలాగే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూనే.. విపక్షాలపై ముఖ్యంగా భాజపాపై విమర్శలు సంధిస్తున్నారు. ప్రభుత్వానికి, పార్టీకి ఉద్యోగులు, నిరుద్యోగులు వ్యతిరేకంగా లేరన్న సంకేతాలను.. ప్రతి సందర్భంలోనూ ప్రచారం చేస్తున్నారు. అన్ని పార్టీలూ ఉద్యోగాల కల్పనే ప్రధాన అంశంగా తీసుకున్నందున.. తెరాస మొదట్నుంచీ ఎదురు దాడి చేస్తూనే ఉంది. ప్రభుత్వ రంగంలో లక్షా 33వేల ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు.. ప్రైవేట్ రంగంలో లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తమదేనని పదే పదే చెబుతోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఐటీఐఆర్, విద్యాసంస్థల ఏర్పాటు... నిధుల కేటాయింపులో అన్యాయం చేసిందని ధ్వజమెత్తుతోంది.

ఇదీ చదవండి: గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న తెరాస

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.