పార్లమెంటు ప్రాంగణంలో తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. భేటీలో తెరాస లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కూడా హాజరవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని డీఎస్‌పై నిజామాబాద్ తెరాస నేతలు గతంలో ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత పరిణామాల్లో ఎన్నికలకు ముందు పలువురు కాంగ్రెస్ నేతలను డీఎస్ కలిశారు. పార్టీ మారతారనే ప్రచారం సాగింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత తెరాస సమావేశాలకు డి.శ్రీనివాస్ దూరంగానే ఉంటున్నారు. పార్లమెంటరీ పార్టీ సమావేశానికి డీఎస్ హాజరవడం ప్రాధాన్యత సంతరించకుంది.
ఇదీ చూడండి: ప్రేమోన్మాది దాడికి గురైన యువతి పరిస్థితి విషమం