ETV Bharat / state

'రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్​లో గళమెత్తండి' - Caa, npr act updates

రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పార్లమెంటులో గళమెత్తాలని తెరాస నిర్ణయించింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ, ఇతర బకాయిలపై నిలదీయాలని పార్లమెంటరీ పక్షానికి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. విభజన హామీలపై ఉభయ సభల్లో గట్టిగా పోరాడాలని... చర్చకు డిమాండ్ చేయాలని వ్యూహం ఖరారు చేశారు. సీఏఏ, ఎన్​పీఆర్​ను వ్యతిరేకిస్తూ... పార్టీ వైఖరికి అనుగుణంగా వ్యవహరించాలని నిర్ణయించారు.

Trs parlamentory meeting in telangana bhavan
తెరాస పార్లమెంటరీ సమావేశం
author img

By

Published : Jan 29, 2020, 7:28 AM IST

తెరాస పార్లమెంటరీ సమావేశం

రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో గళమెత్తాలని తెరాస పార్లమెంటరీ పక్షానికి ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచించారు. ఈనెల 31న ప్రారంభం కానున్న బడ్జెట్‌ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలు... అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది.

ఉభయసభల్లో చర్చకు డిమాండ్..

నెరవేరని విభజన హామీలపై గట్టిగా పోరాడాలని సమావేశం నిర్ణయించింది. ఉభయ సభల్లో చర్చ కోసం డిమాండ్ చేయాలని కేటీఆర్ సూచించారు. ఆర్థిక మాంద్యం వల్ల రాష్ట్రంపై ప్రతికూల ప్రభావం పడుతోందని సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రం నుంచి రావాల్సిన జీఎస్టీ, ఇతర బకాయిలపై పార్లమెంటు వేదికగా కేంద్రాన్ని నిలదీయాలని కేటీఆర్ స్పష్టం చేశారు.

సీఏఏ, ఎన్​పీఆర్​కు వ్యతిరేకం..

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి దీర్ఘకాలిక డిమాండ్ల సాధన కోసం గట్టిగా పట్టుబట్టాలని నిర్ణయించారు. వివిధ పథకాలకు ఆర్థిక సహాయం చేయాలని నీతి ఆయోగ్ ప్రతిపాదించినప్పటికీ.. కేంద్రం ఇప్పటి వరకు రాష్ట్రానికి నిధులు విడుదల చేయని అంశాన్ని ప్రస్తావించాలని కేటీఆర్ సూచించారు. సీఏఏ, ఎన్​పీఆర్​ను వ్యతిరేకిస్తూ పార్టీ వైఖరిని పార్లమెంటులో స్పష్టం చేయాలని సమావేశం నిర్ణయించింది.

వినతులను లేవనెత్తండి..

ప్రజలకు సమస్యగా మారిన నిరుద్యోగిత, ఆర్థిక వ్యవస్థ వంటి కీలకమైన అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కేటీఆర్ చెప్పారు. రైతుబంధు, రైతుబీమా, హరితహారం, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు, ఆరోగ్యశ్రీ వంటి అంశాల స్ఫూర్తితో కేంద్రం కొన్ని పథకాలకు రూపకల్పన చేసిందని.. ఆ అంశాలను పార్లమెంటులో ప్రస్తావించాలని మంత్రి సూచించారు. తెలంగాణ పథకాలను ప్రశంసిస్తున్నప్పటికీ.. ప్రత్యేక నిధులు ఇవ్వకపోవడాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఐఐఎం, పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు, నేషనల్ డిజైన్ ఇన్‌స్టిట్యూట్ కేటాయింపుల వంటి రాష్ట్ర వినతులను లేవనెత్తాలన్నారు.

కేసీఆర్​ను అభినందిస్తూ.. తీర్మానం..

రోజూ సమావేశమై ఎప్పటికప్పుడు తగిన వ్యూహాలు రూపొందించుకోవాలని తెరాస పార్లమెంటరీ పక్షం నిర్ణయించింది. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం.. బలహీనవర్గాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడంపై పార్టీ అధినేత కేసీఆర్​ను అభినందిస్తూ.. సమావేశం తీర్మానం చేసింది.

ఇదీ చూడండి: వాగ్దానాలు మరిచిన మంత్రిని నిలదీసిన మహిళ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.