ముషీరాబాద్ నియోజకవర్గం తెరాసలో డివిజన్ అధ్యక్షు ఎన్నికల చిచ్చు రెండు గ్రూపులకు దారి తీసిందని అసమ్మతి నాయకులు విమర్శించారు. ఎమ్మెల్యేగా ముఠా గోపాల్ ఎన్నికైన ఏడాదిలోపే పార్టీలో రెండు గ్రూపులు ఏర్పడ్డాయని నియోజకవర్గం నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అనుచర వర్గ డివిజన్ అధ్యక్షులు, భంగపడ్డ నాయకులు గ్రూపుగా ఏర్పడి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ వీఎస్టీ రోడ్డులోని ఎస్టీ యూనియన్ కార్యాలయంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు వ్యతిరేకంగా అసమ్మతి నేతలు ఈ కార్యక్రమం నిర్వహించారు. సమావేశంలో చేసిన తీర్మానాలను సీఎం కేసీఆర్ కార్యాలయం, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు అందజేయనున్నట్లు వివరించారు.
ఇవీ చూడండి :ఆయన మార్గదర్శకత్వానికి కృతజ్ఞతలు: కేటీఆర్