నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించినందున హైదరాబాద్లో తెరాస శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. గన్ ఫౌండ్రి కార్పొరేటర్ మమతా సంతోశ్ గుప్తా ఆధ్వర్యంలో.. కోఠి ఆంధ్రాబ్యాంక్ కూడలి వద్ద టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. కవితకు అనుకూలంగా నినాదాలు చేశారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో గెలుపొంది ప్రతిపక్షాల నోరు మూయించారని నాయకులు పేర్కొన్నారు. గతంలో నిజామాబాద్ ఎంపీగా చేసిన అభివృద్ధి మరింత రెట్టింపు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకులు అనవసర ఆరోపణలు చేయకుండా.. నిజామాబాద్ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.
ఇదీ చదవండి: నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కవిత ఘన విజయం