ప్రజలపై పన్నుల భారం వేసే భాజపా అభ్యర్థిని గెలిపించాలా అని పట్టభద్రుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శ్రేణులకు సూచించారు. హైదరాబాద్ ముషీరాబాద్‌లోని ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం నిర్వహించారు.
పార్టీ శ్రేణులు అతి విశ్వాసంతో ఉండకుండా గత అనుభవాలను పరిగణలోకి తీసుకొని హైదరాబాద్- రంగారెడ్డి మహబూబ్‌నగర్ తెరాస అభ్యర్థి వాణీదేవి విజయానికి కృషి చేయాలని మంత్రి పేర్కొన్నారు. కేంద్రం వైఫల్యాలను పట్టభద్రుల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. పట్టభద్రులు తనను గెలిపిస్తారనే నమ్మకం ఉందని వాణీదేవి ఆశాభావం వ్యక్తం చేశారు. తాను గెలిస్తే పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: అంతర్జాతీయ పురస్కారానికి ఎంపికైన గవర్నర్ తమిళిసై