ETV Bharat / state

రాజగోపాల్‌రెడ్డి సంస్థ నుంచి భారీగా నగదు బదిలీ: ఈసీకి తెరాస ఫిర్యాదు - munugode bypoll latest news

TRS Complaint to EC on Rajagopal Reddy: మునుగోడు భాజపా అభ్యర్థి రాజగోపాల్‌ రెడ్డిపై ఎన్నికల సంఘానికి తెరాస ఫిర్యాదు చేసింది. రాజగోపాల్ రెడ్డి కంపెనీ నుంచి వివిధ ఖాతాల్లోకి డబ్బు బదిలీ చేశారని ఫిర్యాదులో తెలిపింది. ఓటర్లకు పంపిణీ చేసేందుకు భారీగా నగదును బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశారని తెరాస ఆరోపించింది.

Trs complaint to EC against Rajagopal Reddy

author img

By

Published : Oct 29, 2022, 10:54 PM IST

TRS Complaint to EC on Rajagopal Reddy: మునుగోడు భాజపా అభ్యర్థి రాజగోపాల్‌ రెడ్డికి చెందిన సంస్థ నుంచి భారీగా నగదు.. పలువురు వ్యక్తులు, స్థానిక వ్యాపారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారని కేంద్ర ఎన్నికల సంఘానికి తెరాస ఫిర్యాదు చేసింది. రాజగోపాల్‌ రెడ్డి సంస్థ నుంచి దాదాపు రూ.5.22 కోట్లు స్థానిక వ్యాపారులు, వ్యక్తులకు చెందిన 23 బ్యాంకు ఖాతాలకు మళ్లించారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ డబ్బంతా మునుగోడు ఉప ఎన్నికల్లో పంపిణీ చేయడం కోసమేనని తెరాస ఆరోపించింది. ఖాతాల నుంచి డబ్బులు తీసుకోకముందే 23 బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని కోరింది.

ఓటర్లకు పంపిణీ చేసేందుకే భారీగా నగదును బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశారని తెరాస ఆరోపించింది. ఎన్నికల నేపథ్యంలో ఈ తరహాలో భారీగా నగదు బదిలీ చేయడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని తెరాస నేత భారతి కుమార్‌ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఈ తరహా చర్యలు సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తక్షణమే రాజగోపాల్‌రెడ్డిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇవీ చదవండి: అప్పటి వరకు మీడియాతో మాట్లాడొద్దు.. మంత్రి జగదీశ్​రెడ్డికి ఈసీ షాక్​

దేశంలో 10 లక్షల ఉద్యోగాలకు కేంద్రం కసరత్తు: మోదీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.