హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తెరాస అభ్యర్థి సురభి వాణీదేవి నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. సుదీర్ఘ తర్జన భర్జనలు, సమీకరణల తర్వాత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణిదేవి అభ్యర్థిత్వాన్ని సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. విద్యావేత్తగా, ఆర్టిస్టుగా, సామాజిక వేత్తగా ఆమెకి మంచి పేరుంది. ప్రస్తుతం వెంకటేశ్వర కళాశాల గ్రూప్ విద్యా సంస్థను నిర్వహిస్తున్నారు.
ఈ నామినేషన్‌కు పలువురు తెరాస నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. నామినేషన్ వేసినప్పటి నుంచే విస్తృతంగా ప్రచారం చేసేలా అధికార పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసింది. నిన్న రాత్రి తెరాస నేత కేకేతో వాణిదేవి భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం పీవీ ఘాట్‌లో నివాళులర్పించిన తర్వాత వాణిదేవి... ఘాట్ నుంచే తన ప్రచారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: సీఎంతో పాటు సీఎస్ జైలుకెళ్లడం ఖాయం: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి