బోరబండ డివిజన్ నుంచి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ సతీమణి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తెరాస కార్యకర్తలు బస్సుల్లో, ద్విచక్ర వాహనాల్లో ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థి సాయికిరణ్ విజయానికి ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని డివిజన్ అధ్యక్షులు కృష్ణమోహన్ విజ్ఞప్తిచేశారు.
సనత్నగర్ పరిధిలోని అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ షబీనా గౌస్ ఉద్దీన్ ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు ముఖ్యమంత్రి సభకు తరలి వెళ్లారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన అభివృద్ధే మల్కాజిగిరి అభ్యర్థి రాజశేఖర్రెడ్డి విజయానికి నాంది పలుకుతుందని షబీనా గౌస్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి:అభివృద్ధికి గ్యారంటీ కేసీఆర్: హరీశ్ రావు