గిరిజన సమస్యలు పరిష్కరించాల్సింది పోయి... గిరిజన నాయకులను, కార్యకర్తలను గృహనిర్బంధం చేసి అరెస్టు చేయడాన్ని గిరిజన లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజ్‌కుమార్ ఖండించారు. అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజైన ఈ రోజు లక్డికాపూల్‌లోని తన స్వగృహంలో పోలీసులు గృహ నిర్బంధం చేసి... అరెస్టు చేసి నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది గిరిజనులను అరెస్టు చేశారని... వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగాలొస్తాయని బలిదానాలు, కేసుల పాలైన గిరిజన బిడ్డలకు నియామకాలు లేవన్నారు. బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయకుండా... పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా ప్రశ్నించిన గిరిజన బిడ్డలపై అక్రమ కేసులు బనాయించడాన్ని తీవ్రంగా ఖండించారు. 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి.. నేటికి అమలు చేయలేదని విమర్శించారు. గిరిజన సమస్యలు పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: 'దేశంలో అన్ని అసెంబ్లీలకు రాష్ట్రం దిక్సూచిగా మారింది'