ETV Bharat / state

గిరిపుత్రుల సంకల్పం... గ్రామానికి సొంతంగా రహదారి

వారి లక్ష్యం కొండంత. మధ్యలో ఎన్నో మలుపులు. పెద్దపెద్ద బండరాళ్లు.. ఐనా వెనక్కి తగ్గలేదు. అవసరం ముందు అవరోధాలు పెద్ద లెక్కకాదంటూ ముందడుగు వేశారు. ప్రభుత్వాలు చేయని పని కోసం చేతులు కలిపారు. ఊరికి రోడ్డువేసుకునేందుకు పలుగు పార పట్టారు. కొండకోనల్లో బండల్ని బద్ధలు కొట్టుకుంటూ సాగిపోతున్నారు. ఊరికి మొనగాళ్లుగా మారారు.

visakha youth build road to village
గిరిపుత్రుల సంకల్పం... గ్రామానికి సొంతంగా రహదారి
author img

By

Published : Aug 28, 2020, 10:02 AM IST

గిరిపుత్రుల సంకల్పం... గ్రామానికి సొంతంగా రహదారి

పలుగుపార పట్టిన వీళ్లంతా ఉపాధి హామీ కూలీలూ కాదు. వాళ్ల ఊరి అవసరం కోసం పలుగుపార పట్టిన మొనగాళ్లు. ఆంధ్రప్రదేశ్​ విశాఖ మన్యంలో కనీసం పాదబాట కూడా లేని లేని అనేక గూడేల్లో హుకుంపేట మండలం కొట్నాపల్లి కూడా ఒకటి. వ్యవసాయ ఉత్పత్తులు సంతలో అమ్ముకోవాలన్నా, రేషన్ తెచ్చుకోవాలన్నా, పిల్లల్ని బడికి పంపాలన్నా మరే అవసరం వచ్చినా ప్రధాన రహదారి వరకూ నడిచి వెళ్లాల్సిందే. ఎవరికైనా రోగం వస్తే డోలీ మోసుకుంటూ. దాదాపు 4కిలోమీటర్లు కొండ దిగి రావాలి. అందుకు కాలిబాట కూడా సరిగాలేదు. రోడ్డు వేయించాలంటూ 35 ఏళ్లుగా అధికారులకు లెక్కలేనన్న వినతి పత్రాలిచ్చి అలసిపోయారు. ఇక ఓపిక నశించింది. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూడడం ఆపేసి సమరశంఖం పూరించారు. గ్రామ యువత చందాలు వేసుకుని పలుగుపారలు కొని ఇదిగో ఇలా బాట నిర్మించుకుంటూ వెళ్తున్నారు.

ఉపాధి పథకంలో చేర్చాలని వినతి

రెండు నెలలుగా ఈ భగీరథ ప్రయత్నం సాగుతోంది. 15 అడుగుల వెడల్పు మేర కొండ మట్టితో చదును చేస్తున్నారు. కొండ ప్రాంతంలో అడ్డొచ్చిన బండల్ని అంతా కలిసి ఓ పట్టుపట్టారు. మూలమలుపుల్లో రాళ్లు పేర్చుకుంటూ లైనింగ్‌ కూడా చేస్తున్నారు. రెండునెలలగా పనులు జరుతూనే ఉన్నాయి. ప్రస్తుతం 2 కిలోమీటర్ల బాట పూర్తవగా మరో రెండు కిలోమీటర్లు ఇంకో నెలలో పూర్తిచేస్తామంటున్నారు గ్రామస్థులు. ఐతే ఈ పనులను ఉపాధి హామీ పథకం కింద చేర్చాలని కోరుతున్నారు. సంకల్పం ఉంటే సాధించలేనిదేమీ లేదని కొట్నాపల్లి గిరిపుత్రులు నిరూపిస్తున్నారు.

ఇదీ చదవండి: 'రామోజీ ఫిల్మ్‌సిటీలో వైభవంగా ఈటీవీ రజతోత్సవం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.