విద్యకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్(Tribal Welfare Minister satyavathi rathod) అన్నారు. దేశ, విదేశాల్లోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొందిన గిరిజన గురుకులాల విద్యార్థులకు ప్రోత్సాహకంగా ఆర్థిక సాయం అందజేయడంతో పాటు... ల్యాప్‌టాప్‌లను సైతం ఇస్తోందని(Minister satyavathi rathod responding on tribal education) తెలిపారు. గిరిజన గురుకులాల విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటీలలో ట్యూషన్ ఫీజులు మినహాయింపు ఉండటమే గాకా. అదనంగా స్కాలర్షిప్ కూడా వస్తుందని తెలిపారు. నీట్ ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో సీట్లు పొందినవారికి ఆర్థిక సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. విదేశాల్లో చదివితే డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఓవర్‌సీస్ స్కాలర్ షిప్ పథకం కింద రూ.20 లక్షలు ఇస్తున్నామన్నారు.
తెలంగాణలో ఉన్న పేదరికాన్ని శాశ్వతంగా తొలగించాలంటే నాణ్యమైన విద్య ఒక్కటే మార్గమని భావించిన సీఎం కేసీఆర్... గతంలో ఎప్పుడూ లేనన్ని గురుకులాలు తీసుకొచ్చి కేజీ టు పీజీ ఉచిత విద్యను అందిస్తున్నారని సత్యవతి రాఠోడ్ (Minister satyavathi rathod) తెలిపారు. తద్వారా గురుకుల విద్యార్థులు దేశంలోని గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాల్లో స్థానం సంపాదించి తమ సత్తా చాటుతున్నారని మంత్రి పేర్కొన్నారు. గిరిజన గురుకులాల్లోని విద్యార్థులు (satyavathi rathod responding on tribal education) ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో సీట్లు సాధించడం కోసం ప్రభుత్వం క్యాట్, జీఆర్ఈ, టోఫెల్, ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తోందని అన్నారు. ప్రభుత్వ గిరిజన గురుకుల విద్యా సంస్థల్లో చదివి... ఉన్నత విద్య కోసం ఇతర విద్యాలయాల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు, ఐఐటీలో సీట్లు సాధించిన విద్యార్థులకు రూ.50వేలు, ల్యాప్ టాప్ అందిస్తున్నామని సత్యవతి రాఠోడ్ అన్నారు. ఎన్ఐటీ, ఐఐఐటి సంస్థల్లో సీటు సాధించిన వారికి రూ. 40వేలు, ల్యాప్ టాప్ ఇస్తున్నామని తెలిపారు.
ఎంబీబీఎస్‌లో సీటు సాధించిన విద్యార్థులకు సైతం రూ.50వేలు, బీడీఎస్‌లో అడ్మిషన్ పొందిన వారికి రూ.40వేలను ప్రోత్సాహకంగా ఇస్తున్నాట్లు పేర్కొన్నారు. 2015 నుంచి 2020 వరకు ఐఐటీల్లో 183 మంది, ఎన్ఐటీలో 200 మంది, ఐఐఐటిలో 59 మంది, ఎంబీబీఎస్‌లో 67 మంది, బీడీఎస్‌లో ముగ్గురు విద్యార్థులకు ఈ ప్రోత్సాహకాలు అందించామన్నారు. ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో సీట్లు పొందిన విద్యార్థులు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారులకు తమ వివరాలు అందజేయాలని తెలిపారు. తెలంగాణ ఈపాస్ వెబ్ సైట్ అయిన https://telanganaepass.cgg.gov.in లో తమ వివరాలు నమోదు చేసుకుంటే వారికి ఉపకారవేతనాలు కూడా అందజేస్తామని అన్నారు.
ఇదీ చదవండి: KISHAN REDDY COMMENTS ON KCR: 'ధర్నాచౌక్‌లో కేసీఆర్ ధర్నా రైతుల కోసం కాదు'