ETV Bharat / state

'గిరిజనులపై దాడులను అరికట్టాలి' - బంజార, గిరిజన ఆత్మీయ సమ్మేళన రౌండ్ టేబుల్

లంబాడీ, ఆదివాసీలపై దాడులను అరికట్టాలని గిరిజన నేతలు డిమాండ్ చేశారు. హైదరాబాద్​లో తెలంగాణ గిరిజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణపై జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు.

tribal round table meeting at nampally telugu university
గిరిజనులపై జరుగుతున్న దాడులను అరికట్టాల్సిందే
author img

By

Published : Dec 30, 2019, 5:08 PM IST

హైదరాబాద్​లోని నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయంలో బంజార, గిరిజన ఆత్మీయ సమ్మేళన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, రాష్ట్ర మాజీ మంత్రి అమర్ సింగ్, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, ఎమ్మెల్సీ రాములు నాయక్​తో పాటు 42 గిరిజన కుల సంఘాలు పాల్గొన్నారు.

గిరిజనులపై జరుగుతున్న దాడులను అరికట్టాల్సిందే
లంబాడీ, గిరిజనులపై జరుగుతున్న దాడులను, దుష్ప్రచారాలను అరికట్టడం... జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడం... ఎస్టీ కమిషన్​ను ఏర్పాటు చేయడం వంటి డిమాండ్లపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వీటిపై కూలంకషంగా చర్చించేందుకు జనవరి 27, 28న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే రాములు నాయక్ స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.