ETV Bharat / state

TRESA: రెవెన్యూశాఖలో పదోన్నతుల సమస్యను పరిష్కరించండి: ట్రెసా - రెవెన్యూ శాఖ

రెవెన్యూశాఖలో దీర్ఘకాలికంగా పెండింగ్​లో ఉన్న పదోన్నతుల సమస్యను పరిష్కరించాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్(TRESA) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ట్రెసా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్ సచివాలయంలో సీఎస్ సోమేశ్ కుమార్​ను కలిసి వినతిపత్రం అందించారు.

Tresa leaders meet cs somesh kumar
సీఎస్ సోమేశ్ కుమార్​ను కలిసిన ట్రెసా నాయకులు
author img

By

Published : Jul 29, 2021, 9:19 PM IST

రెవెన్యూశాఖలో పెండింగ్​లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ట్రెసా నాయకులు సీఎస్ సోమేశ్ కుమార్​ను కలిశారు. ఈ మేరకు ట్రెసా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్ హైదరాబాద్​లోని సచివాలయంలో ఆయనకు వినతిపత్రం అందజేశారు. దీర్ఘకాలంగా పెండింగ్​లో ఉన్న పదోన్నతుల సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అర్హత కల్గిన తహసీల్దార్లు, డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతులు కల్పించాలని కోరారు. డిప్యూటీ తహసీల్దార్లకు పదోన్నతి కోసం అనుబంధ డీపీసీ నిర్వహించాలని సీఎస్​కు విన్నవించారు. డిప్యూటేషన్ విధానంలో సీసీఎల్ఎ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రొబేషనరీ డిప్యూటీ తహసీల్దార్లు ముఖ్యంగా మహిళా ఉద్యోగినులకు స్పౌజ్, మెడికల్ కేటగిరీ ప్రకారం జిల్లాలకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

వీఆర్‌వోలను రెవెన్యూశాఖలోనే కొనసాగించాలి: ట్రెసా

చాలాకాలంగా ఒకేచోట ఉన్న ఉద్యోగులను బదిలీ చేయాలని ట్రెసా నాయకులు కోరారు. దీర్ఘకాలంగా ఒకే ప్రాంతంలో పని చేస్తున్న తహసీల్దార్లు, ఇతర ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పని ఒత్తిడి దృష్ట్యా వీఆర్వోలను రెవెన్యూశాఖలోనే కొనసాగించాలన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు వీఆర్ఏలకు వెంటనే పే స్కేల్ వర్తింపజేయాలని ట్రెసా విజ్ఞప్తి చేసింది. అంశాల వారీగా నెలరోజుల్లోపు సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని సీఎస్ హామీ ఇచ్చినట్లు ట్రెసా నాయకులు తెలిపారు.

ఇదీ చూడండి:

TRESA: 'రెవెన్యూ ఉద్యోగులపై వివక్ష సరికాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.