ETV Bharat / state

ధరణి సమస్యలను పరిష్కరిస్తామన్నారు: ట్రెసా - Dharani portal news

హైదరాబాద్​ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్​ను ట్రెసా ప్రతినిధి బృందం కలిసింది. ధరణి పోర్టల్​ సమస్యలను వివరించింది. వారం, పది రోజుల్లో పరిష్కరిస్తామని సీఎస్ హామీ ఇచ్చినట్లు తెలిపింది.

ధరణి సమస్యలను పరిష్కరిస్తామన్నారు: ట్రెసా

author img

By

Published : Dec 16, 2020, 7:40 PM IST

ధరణి పోర్టల్​కు సంబంధించిన సమస్యలను వారం, పది రోజుల్లో పరిష్కరిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్ హామీ ఇచ్చినట్లు తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్- ట్రెసా తెలిపింది. సచివాలయంలో సీఎస్​ను కలిసిన ట్రెసా ప్రతినిధి బృందం ధరణి సమస్యలను వివరించింది.

రెవెన్యూశాఖలో ధీర్ఘకాలికంగా పెండింగ్​లో ఉన్న అన్ని స్థాయిల పదోన్నతులను జనవరి నెలలో చేపడతామని ప్రధాన కార్యదర్శి హామీ ఇచ్చినట్లు ట్రెసా అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి చెప్పారు. శాఖలోని ఇతర పెండింగ్ సమస్యలన్నింటినీ కూడా త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పినట్లు తెలిపారు.

ఇవీచూడండి: దేశవ్యాప్తంగా హైకోర్టు సీజేలు, జడ్జీలు బదిలీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.