రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను రవాణా కమిషనర్ ఎం.ఆర్.ఎం రావు మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా మంత్రితో భేటీ అయ్యారు. గురువారం హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో ప్రత్యేకంగా పర్యావరణ హితాన్ని కాంక్షిస్తూ మంత్రికి పూలకుండిని అందించారు. అనంతరం మంత్రితో శాఖా పరమైన అంశాలపై కాసేపు చర్చించారు.
బీఎస్-4 వాహనాల పూర్తిస్థాయి రిజిస్ట్రేషన్ల ప్రక్రియతో పాటు వివిధ పనుల కోసం ఆర్టీఏ కార్యాలయానికి వచ్చే వాహనదారులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా తీసుకుంటున్న చర్యలను కమీషనర్ మంత్రికి తెలిపారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా కార్యాచరణతో ముందుకెళ్తున్నట్లు కమిషనర్ వివరించారు.
ఇవీ చూడండి: ఏ పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: ఈటల