నలుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రింటింగ్ కమిషనర్‌గా ఉన్న వీకే సింగ్‌ను రాష్ట్ర పోలీస్ అకాడమీ సంచాలకులుగా నియమించారు. ఆ స్థానంలో ఉన్న సంతోష్ మెహ్రాను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. సంజయ్ కుమార్ జైన్‌ను అగ్నిమాపక శాఖ డీజీగా బదిలీ చేశారు. ఆ స్థానంలో ఉన్న గోపీకృష్ణను ప్రింటింగ్, స్టేషనరీ కమిషనర్‌గా బదిలీ చేశారు. ఐపీఎస్‌ల బదిలీలు జరుగుతాయని గత రెండు మూడు నెలల నుంచి పోలీస్ శాఖలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే పదోన్నతి పొందిన పలువురు ఉన్నతాధికారులు పాత స్థానాల్లోనే కొనసాగుతున్నారు. వాళ్లను కూడా బదిలీ చేసి పోస్టింగులు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం సీనియర్ ఐపీఎస్‌ల బదిలీలు జరిగిన తరుణంలో మిగతా ఐపీఎస్‌ల బదిలీలు కూడా జరిగే అవకాశం ఉందని సమాచారం.
ఇవీచూడండి: 'ఓఎంసీ కేసును విశాఖ సీబీఐకు బదిలీ చేయండి'