గత రెండున్నర నెలలుగా దీర్ఘ కాలిక సెలవుల్లో ఉన్న ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు (Transco CMD Prabhakar Rao) మంగళవారం విధుల్లో చేరారు (transco cmd joind duty). మింట్ కాంపౌండ్‌లోని ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి (Jagadeesh reddy) ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో సీఎండీ పాల్గొన్నారు.
ఈ సమావేశంలో డిస్కంల సీఎండీలు, ట్రాన్స్‌కో జేఎండీ కూడా పాల్గొన్నారు. రాష్ట్ర విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితి, విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు బొగ్గు లభ్యతలతో పాటు ఏఆర్‌ఆర్ ప్రతిపాదనలపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తుంది.
ఇదీ చూడండి: MLC Elections: తెలంగాణలో ఎన్నిక షెడ్యూల్ విడుదల.. నేటినుంచే కోడ్ అమలు