రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని ట్రాన్స్‌కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు అన్నారు. నిరంతరం శ్రమిస్తున్న విద్యుత్ ఉద్యోగులకు టీకాలు ఇవ్వడానికి సీఎం కేసీఆర్ అంగీకరించి ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ప్రతి ఒక్క విద్యుత్ ఉద్యోగి కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని సీఎండీ ప్రభాకర్ రావు కోరారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్పీడీసీఎల్ పరిధిలోని అన్ని విభాగాలకు చెందిన విద్యుత్ ఉద్యోగులందరికీ టీకాలు పేర్కొన్నారు.
విద్యుత్ సౌదలో ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డితో కలిసి ఆయన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క ఉద్యోగి ఉపయోగించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు విధిగా మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటిస్తూ... ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాలని రఘుమారెడ్డి సూచించారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని అప్పుడే కరోనా బారి నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చని తెలిపారు.
ఇదీ చూడండి: Petrol Price: హైదరాబాద్‌లోనూ సెంచరీ దాటిన పెట్రోల్