ETV Bharat / state

విద్యుత్ సంస్థలో కొలువుల జాతర - jobs in Transco in Telangana

రాష్ట్రంలో నిరుద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. సుదీర్ఘకాలం తర్వాత విద్యుత్‌ సంస్థలో ఒకేసారి 3025 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ పరిధిలో మూడు కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీకి బుధవారం ఆ సంస్థ నియామక ప్రకటన విడుదల చేసింది.

విద్యుత్ సంస్థల్లో కొలువుల జాతర
author img

By

Published : Oct 17, 2019, 5:07 AM IST

Updated : Oct 17, 2019, 8:01 AM IST

దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ 3025 పోస్టుల భర్తీకి 3 వేర్వేరు ప్రకటనలు విడుదల చేసింది. జూనియర్‌ లైన్‌ మెన్‌ పోస్టులు 2500, జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్ కంప్యూటర్‌ ఆపరేటర్‌ 500, జూనియర్‌ పర్సనల్‌ అధికారి 25 పోస్టులకు ప్రకటనలు జారీ చేసింది.

వయోపరిమితిని పెంచండి...

గతంలో ఈ పోస్టులకు వయో పరిమితి 44 ఏళ్ళుండగా తాజా ప్రకటనల్లో తగ్గించింది. జేఎల్‌కు 35, మిగతా రెండు రకాల పోస్టులకు 34 ఏళ్ళలోపు వారే దరఖాస్తు చేయాలని పేర్కొంది. ప్రస్తుతం విద్యుత్‌ సంస్థల్లో... అర్టిజన్‌ పేరుతో తాత్కాలిక ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆ ఉద్యోగుల్లో వారు చేరే తేదీ నాటికి ఎంత వయసుందో.. దాని ప్రకారం పరిగణనలోకి తీసుకుంటారు. వారికి ప్రస్తుతం ప్రకటించిన 35 ఏళ్ళ పరిమితి వర్తించదు. పబ్లిక్‌ సర్వీసు కమీషన్‌ భర్తీ చేస్తున్న పోస్టులకు దరఖాస్తుదారులు 44 ఏళ్ళ వయో పరిమితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ పోస్టులకు కూడా వయో పరిమితి పెంచాలని నిరుద్యోగులు కొరుతున్నారు.

జేఎల్ పోస్టులకు ఈనెల 31 నుంచి నవంబర్‌20లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డిసెంబర్‌ 22న రాతపరీక్ష ఉంటుంది. మిగిలిన రెండు రకాల పోస్టులకు... ఈ నెల 22 నుంచి వచ్చేనెల10 లోగా దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్‌ 15న రాతపరీక్ష నిర్వహించనున్నారు.

విద్యుత్ సంస్థల్లో కొలువుల జాతర

ఇదీ చూడండి: ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష

TG_HYD_04_17_Trans_Co_Notification_AV_TS10017 Contributer : S NAGARAJU Note : Dry Ph.. 9346919348 ( ) దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ 3025 పోస్టుల భర్తీకి మూడు వేర్వేరు ప్రకటనలు విడుదల చేసింది. జూనియర్‌ లైన్‌ మెన్‌ పోస్టులు 2500, జూనియర్‌ అసిస్టేంట్‌ కం, కంప్యూటర్‌ ఆపరేటర్‌ 500, జూనియర్‌ పర్సనల్‌ అధికారి 25 పోస్టులకు ఈ ప్రకటనలు జారీ చేసింది. గతంలో ఈ పోస్టులకు వయో పరిమితి 44 ఏళ్ళుండగా తాజా ప్రకటనల్లో తగ్గించింది. జెఎల్‌ కు 35, మిగతా రెండు రకాల పోస్టులకు 34 ఏళ్ళలోపు వారే దరఖాస్తు చేయలనడంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం విద్యుత్‌ సంస్థల్లో అర్టిజన్‌ పేరుతో తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఆ ఉద్యోగుల్లో వారు చేరే తేదీ నాటికి ఎంత వయసుందో దాని ప్రకారం పరిగణలోకి తీసుకుంటారు. వారికి ప్రస్తుతం ప్రకటించిన 35 ఏళ్ళ పరిమితి వర్తించదు. పబ్లిక్‌ సర్వీసు కమీషన్‌ భర్తీ చేస్తున్న పోస్టులకు దరఖాస్తుదారులు సైతం 44 ఏళ్ళ వయో పరిమితి ఉంది. అలాగే వీటికి వయో పరిమితి పెంచాలని నిరుద్యోగులు కొరుతున్నారు. జెఎ పోస్టులకు ఈ నెల 31 నుండి నవంబర్‌ 20 లోపు దరఖాస్తు చేయాలి. డిసెంబర్‌ 22న రాతపరీక్ష ఉంటుంది. మిగతా రెండు రకాల పోస్టులకు ఈ నెల 22 నుండి వచ్చే నెల 10 లోగా దరఖాస్తు చేయాలి. వీటికి డిసెంబర్‌ 15న రాతపరీక్షలున్నాయి. టిఎస్‌సదరన్‌ పవర్‌.జీఓవి.ఇన్‌ వెబ్‌ సైట్‌ ద్వారా అన్‌లైన్‌ లో దరఖాస్తు చేయాలి. పూర్తి వివరాలకు సంస్థ వెబ్‌ సైట్‌ చూడవచ్చు..
Last Updated : Oct 17, 2019, 8:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.