రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న రెగ్యులర్, కాంట్రాక్టు అధ్యాపకులకు ఆన్లైన్ బోధనపై శిక్షణ ఉంటుందని ఇంటర్ విద్య కమిషనర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,300 మంది అధ్యాపకులకు... కాగ్నిజెంట్, అడోబ్ సిస్టమ్స్, నిర్మాణ్ స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో ఆన్ లైన్ శిక్షణ ఇస్తున్నట్టు జలీల్ పేర్కొన్నారు.
వివిధ సాఫ్ట్వేర్లు, గ్రాఫిక్స్, అసైన్ మెంట్లను ఉపయోగించి ఆన్లైన్ బోధనకు అవసరమైన మెటీరియల్ ఏవిధంగా రూపొందించాలి... వాటిని విద్యార్థులకు ఏవిధంగా బోధించాలి అనే అంశంపై శిక్షణ ఇస్తామన్నారు. అధ్యాపకులను బ్యాచ్‌లుగా విభజించి.. ఒక్కో బ్యాచ్‌కి రెండు రోజులపాటు శిక్షణ ఇస్తారు. అధ్యాపకులకు అప్పగించిన ప్రాజెక్టులు పూర్తి చేసి.. 12వ రోజున సమర్పించాల్సి ఉంటుంది. వాటిని సమీక్షించిన తర్వాత.. బ్యాచ్‌ల వారీగా గ్రాడ్యుయేషన్ డే నిర్వహిస్తారు.
ఇదీ చూడండి: జూరాల గేట్లు ఎత్తిన అధికారులు... శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు