హైదరాబాద్ కూకట్పల్లి పరిధిలో విషాదం చోటుచేసుకుంది. హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్లో ఓ వ్యక్తి... వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అతని వద్ద రైల్వే పాస్‌ను పరిశీలించగా... మృతుడు ఖమ్మం జిల్లా ప్రాంతానికి చెందిన సైదులుగా తెలిసింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సంబంధిత వ్యక్తులు వస్తే... పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని వెల్లడించారు. మృతదేహాన్ని రైల్వేపోలీసులు... శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: రజనీకి విలన్‌గా 'ఖుషీ' దర్శకుడు