మద్యం మత్తులో ఒక యువకుడు గూడ్స్ కింద పడి కాలు పోగొట్టుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా గుత్తి రైల్వే జoక్షన్లో చోటు చేసుకుంది. తమిళనాడుకు చెందిన కుమార్ అనే యువకుడు హిందూపురం వెళ్లే పాసింజర్ రైలు కోసం ఎదురు చూస్తుండగా గుంతకల్లు నుండి గుత్తికి రైలు వచ్చింది. అయితే అనుకున్న ప్లాట్‌ఫాంలోకి రాకుండా మరొక ప్లాట్పామ్లోకి రైలు వచ్చి ఆగడంతో... రైలెక్కాలనే ఆతృతతో ఒకటవ ప్లాట్‌ఫాం నుండి మరో ప్లాట్‌ఫాంలోకి వెళ్లడానికి వంతెన నుండి కాకుండా పట్టాల నుండి వెళ్లే ప్రయత్నం చేసాడు. అప్పటికే.. అక్కడి పట్టాలపై నిలిచి ఉన్న గూడ్స్ రైలు కింద నుంచి వెళ్లాలని ప్రయత్నిస్తుండగా... ప్రమాదవశాత్తు గూడ్స్ కదలడంతో చక్రాల కింద పడిన కుమార్ కాలు చిక్కుకొని నుజ్జునుజ్జయిపోయింది. అతను మద్యం సేవించడం వల్లే గూడ్స్‌ను దాటలేక... ప్రమాదానికి గురయ్యాడని పోలీసులు తెలిపారు. వెంటనే క్షతగాత్రుడిని చికిత్స కోసం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరరలించగా... పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండీ :రైలు కిందపడి ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య