ETV Bharat / state

భాగ్యనగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. గణనాథుడి నిమజ్జనానికి వేళాయే..! - strict traffic ruestriction asbecause of ganesh immersion in hyderabad

గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్​లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శోభాయాత్రను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ పోలీసులు ప్రధాన రహదారులపై ఆంక్షలు విధించారు. యాత్ర జరిగే ప్రాంతాల్లో ఇతర వాహనాల రాకపోకలకు అనుమతి లేదు. ఇతర వీధుల నుంచి వచ్చే మార్గాలు గణపయ్య ఊరేగింపు జరిగే ప్రధాన మార్గాలను వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.

traffic restrctions-in-hyderabad-due-to-ganesh-immesrsion
గణపయ్యను గంగమ్మ ఒడికి చేర్చేందుకు భాగ్యనగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
author img

By

Published : Aug 31, 2020, 8:34 PM IST

Updated : Aug 31, 2020, 8:47 PM IST

వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని దృష్టిలో ఉంచుకుని భాగ్యనగరవ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం వరకు ట్రాఫిక్​ ఆంక్షలు కొనసాగనున్నాయి. సోమవారం అర్ధరాత్రి నుంచే నగరంలోని అంతర్రాష్ట్ర, జిల్లాల లారీల ప్రవేశంపై నిషిద్ధం విధించారు. ఆర్టీసీ బస్సులను సైతం ట్రాఫిక్​ పోలీసులు పలుచోట్ల దారి మళ్లించనున్నారు. విమానాశ్రయం, రైల్వే స్టేషన్లకు వెళ్లే ప్రయాణికులు గణేష్ నిమజ్జన యాత్ర మీదుగా కాకుండా ప్రత్యామ్నయ దారుల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.

నిమజ్జనం సందర్భంగా నగర ప్రజల కోసం కంట్రోల్ రూమ్​ను ఏర్పాటు చేశారు. వాహనాల దారి మల్లింపు, ట్రాఫిక్ ఆంక్షల గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు 040-27852482, 9490598985, 9010303626 నెంబర్లకు ఫోన్ చేయొచ్చని పోలీస్ ఉన్నతాధికారులు సూచిస్తgన్నారు. గూగుల్ మ్యాప్​లో ట్రాఫిక్ రద్దీపై ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేలా ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేశారు.

trafficrestrctions in hyderabad due to ganesh immesrsion
నిమజ్జనం నేపథ్యంలో భాగ్యనగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

ఫలకనుమా నుంచి వచ్చే శోభాయాత్ర చార్మినార్, అఫ్జల్​గంజ్, గౌలీగూడా చమాన్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్​బాగ్ మీదుగా ట్యాంక్ బండ్ లేదా ఎన్​టీఆర్​ మార్గ్​కు మళ్లిస్తారు. ఉస్మాన్ గంజ్ వద్ద రహదారి పనులు జరుగుతున్నందున ఈ సారి అఫ్జల్​గంజ్ నుంచి గౌలిగూడా చమాన్ మీదుగా శోభాయాత్రకు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు.

సికింద్రాబాద్ నుంచి వచ్చే శోభాయాత్ర ఆర్పీ రోడ్, కర్బాల మైదానం, కవాడిగుడ, ముషీరాబాద్ కూడలి, హిమయత్ నగర్ జంక్షన్, లిబర్టీ మీదుగా ట్యాంక్ బ్యాండ్ లేదా ఎన్​టీఆర్ మార్గ్ వైపు మళ్లిస్తారు. ఉప్పల్ నుంచి వచ్చే శోభాయాత్ర రామాంతపూర్, అంబర్​పేట కూడలి, శివంరోడ్, ఫీవర్ ఆస్పత్రి, నారాయణగూడ కూడలి, లిబర్టీ మీదుగా కొనసాగేలా ఏర్పాట్లు చేశారు.

దిల్​సుఖ్​నగర్, ఐఎస్​ సదన్ వైపు నుంచి వచ్చే శోభాయాత్ర సైదాబాద్, నల్గొండ క్రాస్ రోడ్, చాదర్ ఘాట్, ఎంజే మార్కెట్ మీదుగా మళ్లించనున్నారు. టోలిచౌకి, రేతి బౌలి, మెహదీపట్నం నుంచి వచ్చే శోభాయాత్ర మాసబ్ ట్యాంక్, నిరంకారి భవన్ మీదుగా ఎన్​టీఆర్​ మార్గ్​ వైపు వెళ్లనుంది.

తప్పాచబుత్ర, అసిఫ్ నగర్ వైపు నుంచి వచ్చే శోభయాత్ర సీతారాంబాగ్, బోయగుడ కమాన్, గోశామహల్ బారదారి, ఎంజే మార్కెట్ మీదుగా ముందుకు వెళ్లనున్నాయి. ఎర్రగడ్డ, ఎస్సార్ నగర్ నుంచి వచ్చే శోభాయాత్ర అమీర్​పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్ మీదుగా ఎన్​టీఆర్​ మార్గ్​కు చేరుకోనుంది. ప్రతి శోభాయాత్ర మార్గంలో పోలీసులు అడుగడుగునా పర్యవేక్షించనున్నారు.

ఇదీ చదవండి:ఆన్​లైన్ ఓనం: వేడుకల్లో అబ్బురపరిచిన చిన్నారులు

Last Updated : Aug 31, 2020, 8:47 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.