Traffic Problems in Hyderabad : భాగ్యనగరంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా తయారైంది. గమ్యాన్ని చేరేందుకు వాహనదారులు నరకం చూస్తున్నారు. ప్రధాన రహదారుల్లో సిబ్బంది లేక ఉదయం, సాయంత్రం సమయాల్లో ఎక్కిడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోంది. ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ల సంఖ్య 18 నుంచి 31కు పెంచినా, పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
Public Facing Problems Due To Traffic Jam in Hyderabad : నగరంలో కొందరు పోలీసులు వసూళ్ల దందాతో హల్‌చల్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఎస్సైలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులకు లక్ష్యం నిర్దేశిస్తున్నారు. దీంతో ఏం చేయలేక కొందరు ఆందోళనకు గురై ఆసుపత్రుల పాలైనట్టు విశ్వసనీయ సమాచారం. హోటళ్ల నుంచి నెలవారీ వసూళ్లు చేయట్లేదని ఒక ఏసీపీ ఎస్సైను తీవ్ర పదజాలంతో దూషించడంతో ఆ విషయం కాస్త ఉన్నతాధికారుల తెలిసింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, గోల్కొండ, ట్యాంక్‌బండ్, జేబీఎస్, చార్నినార్ తదితర ప్రాంతాల్లో ఇష్టానుసారం వాహనాలు రోడ్లపై నిలపడంతో తరచూ వాహనదారుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఫొటోలు, చలానాలకే పరిమితం : రాష్ట్రంలో ఎన్నికల తంతు ముగియటంతో ట్రాఫిక్ యంత్రాంగం చలానాలపై గురిపెట్టింది. ఉల్లంఘనలకు అడ్డుకట్ట వేసేందుకు అట్టహాసంగా ప్రారంభించిన ఆపరేషన్ రోప్(Operation Rope in Hyderabad) అటకెక్కింది. అర్ధరాత్రి దాటే దాకా ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు(Traffic Police) విధులు నిర్వర్తిస్తారనే మాటలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. నిర్దేశిత సమయంలో మాత్రమే నగరంలోకి ప్రవేశించాల్సిన ప్రైవేటు బస్సులు, భారీవాహనాలు ఎప్పుడైనా సరే యథేచ్ఛగా వస్తున్నాయి.
Hyderabad Public Facing Traffic Issues : రాత్రి 8 గంటలు దాటాక ఎస్సార్‌నగర్, పండాగుట్ట, లక్డీకాపూల్, మలక్‌పేట్, మెహిదీపట్నం, అమీర్‌పేటే తదితర ప్రధాన మార్గాల్లో బస్సులు రోడ్లపైనే నిలుపుతున్నారు. నగరంలో రాత్రి 11 గంటలకే దుకాణాలు మూసివేయాలనే సీపీ ఆదేశాలు పూర్తిగా అమలుకు నోటుకోవట్లేదు. బంజారాహిల్స్ రోడ్ నెంబరు 1, 10, టోలిచౌకి, సికింద్రాబాద్, అబిడ్స్ ప్రాంతాల్లో అర్ధరాత్రి దాటేంత వరకూ ఐస్ క్రీమ్పార్లర్లు, కాఫీక్లబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లు తెరిచే ఉంటున్నాయి. అలాగే షేక్‌పేట్ నాలా నుంచి గోల్కొండ, లంగర్‌హౌస్, టోలిచౌకి వెళ్లే మార్గల్లో ట్రాఫిక్ పోలీసులున్నా వాహనాలు గంటల తరబటి బారులు తీరాల్సి వస్తోంది. దీంతో వాహనాలను నియంత్రించాల్సిన పోలీసులు ఫొటోలు, చలనాలకే పరిమితమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ - 5 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
రెచ్చిపోతున్న వసూల్ రాజాలు : నగరంలోని పశ్చిమ మండల పరిధిలో రెండు హోటళ్లు అర్ధరాత్రి దాటేంత వరకూ తెరిచే ఉంటాయి. ఖైరతాబాద్-కూకట్‌పల్లి ప్రధాన మార్గంలోని ఓ హోటల్ బయటే రోడ్డుపై వాహనాలు నిలిపినా చూసీచూడనట్టు ఉంటారు. అయితే గతంలో ఈ హోటల్‌లో సిబ్బంది దాడిలో ఒక యువకుడు మరణించటం సంచలనం రేపింది. ఇంతటి కీలకమైన ప్రాంతంలో పనిచేసే ఏసీపీ పెడుతున్న ఒత్తిడి తట్టుకోలేక కార్యాలయంలో కానిస్టేబుల్ అనారోగ్యానికి గురై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం.
Public Facing Traffic Problems in Hyderabad : రోజూ బిర్యానీ, స్వీటు ప్యాకెట్లు, కావాలంటూ ఆయన్నుంచి డిమాండ్ పెరగటంతో ఒక ఎస్సై సెలవులో వెళ్లినట్లు తెలుస్తోంది. అలాగే ఇదే మండలంలోని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ తన పరిధిలో కొత్త నిర్మాణాలపై కన్నేశారు. ట్రాఫిక్ అనుమతులు లేకుండా ఎలా నిర్మాణం చేస్తారంటూ నెలరోజుల్లో సుమారు 100 మందికి నోటీసులు ఇచ్చి సొమ్ము చేసుకున్నట్లు తెలిసింది. ఉత్తర మండలం పరిధిలో ఒక ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ప్రతి నెలా మామూళ్లు అందకుంటే కేసులతో హడావుడి చేయటం విశేషం. మరో ఇన్‌స్పెక్టర్ చిరు వ్యాపారాలు కొనసాగాలంటే తన చేతిలో పైసల్ పడాల్సిందేనంటూ తెగేసి చెప్పారని హాకర్లు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు.
సీఎం ప్రమాణ స్వీకారం ఎఫెక్ట్ - ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఫుల్ ట్రాఫిక్ జామ్