వైద్య సంబంధ, అత్యవసర కారణాలు మినహా చిన్న, చిన్న కారణాలు చెబుతూ రోడ్లపైకి వచ్చే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నారు. వాహనదారులు ఇష్టారాజ్యంగా రోడ్లపైకి వస్తుండడంతో మంగళవారం వరకూ హెచ్చరికలతో సరిపెట్టారు పోలీసులు. ఇకపై వాహనాలను స్వాధీనం చేసుకొని... లాక్‌డౌన్ ఎత్తివేశాకే తిరిగిస్తారు. తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎస్సార్‌నగర్, ఎర్రగడ్డ, అమీర్‌పేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, పాతబస్తీ ప్రాంతాల్లో మంగళవారం వందల సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి వచ్చాయి. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు కమాండ్ కంట్రోల్ రూం ద్వారా ట్రాఫిక్ పోలీసులకు ఆదేశాలిచ్చారు. మంగళవారం ప్రతి కూడలి వద్ద గంటగంటకూ ట్రాఫిక్ పరిస్థితిని పరిశీలించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకూ వాహనదారులను ఆపి హెచ్చరించి ఇళ్లకు పంపించారు.
చట్టం తీవ్రత తెలుసుకోండి
లాక్‌డౌన్ సమయంలో అత్యవసర సేవల వాహనాలు మినహా ఎవరూ రోడ్లపైకి రాకూడదని చట్టం చెబుతోంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 15 రోజులుగా కేసులు నమోదు చేస్తున్నాం. వాహనాలు స్వాధీనం చేసుకుంటున్నా కొందరు తీవ్రతను తెలుసుకోవడం లేదు. రోడ్లపై అకారణంగా తిరిగేందుకు బైక్‌లు, కార్లపై వచ్చిన వారిపై ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం కేసులు నమోదు చేసి వారి వాహనాలను స్వాధీనం చేసుకోనున్నాం.
- ఎస్.అనిల్‌కుమార్, అదనపు సీవో(ట్రాఫిక్)
ఇదీ చూడండి: కరోనా కోసమని ఆ మాత్ర వాడితే చూపు తగ్గుతుంది!