ETV Bharat / state

సీఎం కేసీఆర్​ సభతో నగరంలో ట్రాఫిక్​ ఆంక్షలు - సీఎం కేసీఆర్​ బహిరంగ సభతో ట్రాఫిక్​ ఆంక్షలు

హైదరాబాద్​లోని ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ ఆంక్షలకు వాహనదారులు సహకరించాలని పోలీసులు కోరారు.

Traffic Diversions in hyderabad due to the cm kcr public meeting
సీఎం కేసీఆర్​ సభతో నగరంలో ట్రాఫిక్​ ఆంక్షలు
author img

By

Published : Nov 28, 2020, 5:18 AM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్​ ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సభ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కంట్రోల్ రూమ్ వైపు నుంచి బీజేఆర్ విగ్రహం వైపునకు వచ్చే వాహనాలను చాపెల్ రోడ్, నాంపల్లి వైపు మళ్లించనున్నారు. అబిడ్స్, గన్ ఫౌండ్రి నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలు ఎస్​బీఐ, చాపెల్ రోడ్‌ వైపు.. బషీర్​బాగ్ జంక్షన్ నుంచి జీపీఓ, అబిడ్స్ నుంచి వచ్చే వాహనాలు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, కింగ్ కోటి వైపు మళ్లించనున్నారు.

ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్​బాగ్​కు వచ్చే వాహనాలు హిమాయత్​నగర్ వై జంక్షన వైపు మళ్లించనున్నట్లు ట్రాఫిక్​ పోలీసులు తెలిపారు. సభకు వచ్చే వారి వాహనాల పార్కింగ్ కోసం స్థలాలను సూచించారు. సికింద్రాబాద్ నుంచి వచ్చే వారు స్టేడియం గేట్-జీ వద్ద దిగి ఆ వాహనాలు పబ్లిక్ గార్డెన్, రవీంద్ర భారతి, ఐమాక్స్ వద్ద పార్కింగ్ చేయాలని సూచించారు.

ఎల్బీనగర్, దిల్​సుఖ్​నగర్, పాతబస్తీ నుంచి వచ్చే వాహనాలు ఎఆర్ పెట్రోల్ పంప్ వద్ద దిగి వాహనాలు పబ్లిక్ గార్డెన్, పీపుల్స్ ప్లాజా వద్ద పార్కింగ్ చేయాలని తెలిపారు. ముషీరాబాద్, అంబర్ పేట, హిమాయత్‌నగర్ నుంచి వచ్చే వారు స్టేడియం ఎఫ్​, ఎఫ్​-1 వద్ద దిగాలని.. మెహదీపట్నం నుంచి వచ్చే వాహనాలు గేట్-జీ వద్ద దిగి వాహనాలు నిజాం కాలేజ్ గ్రౌండ్​లో పార్కింగ్ చేయాలని సూచించారు. ట్రాఫిక్ ఆంక్షలకు వాహనదారులు సహకరించాలని పోలీసులు కోరారు.

ఇదీ చదవండి: భాజపా గద్దెనెక్కే సమయం ఆసన్నమైంది: జేపీ నడ్డా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.