ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో ఝార్ఖండ్,ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కార్మికులకు తెలంగాణ ప్రైవేటు బ్యాంకింగ్ సెక్టార్ ఉద్యోగుల నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ట్రాఫిక్ డీసీపీ మనోహర్ చేతులమీదుగా 200 మంది కార్మికులకు బియ్యం, పప్పు అందజేశారు.
ఆకలితో అలమటిస్తున్న పేదలకు అన్నం పెట్టేందుకు మానవతా వాదులు ముందుకు రావాలని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు గంధం రాములు కోరారు. నిరుపేదలకు సాయం చేసిన కెనరా బ్యాంక్ సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నిర్వహకులను డీసీపీ అభినందించారు.