Hero Prabhas: హీరో ప్రభాస్ కారుకు పోలీసులు చలానా విధించారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో బ్లాక్ ఫ్రేమ్‌తో వెళ్తున్న వాహనాన్ని గుర్తించారు. దీనికితోడు నంబర్‌ప్లేట్ సరిగ్గా లేకపోవడం, ఎంపీ స్టిక్కర్ ఉండటం గమనించారు. కారు ఎవరిదని విచారించగా హీరో ప్రభాస్ కారుగా తేలింది. ఎంపీ స్టిక్కర్‌ను తొలగించిన పోలీసులు 1,450 రూపాయలు జరిమానా విధించారు. జరిమానా విధించిన సమయంలో ప్రభాస్ కారులో లేరు.
వాహనాలకు ఉన్న బ్లాక్ స్టిక్కర్లు, బ్లాక్ ఫిల్మ్‌లను తొలగించాలని గత కొన్నిరోజులుగా ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తోన్న సంగతి తెలిసిందే. అలా తొలగించని వారి వాహనాలకు ఫైన్స్ కూడా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాగచైతన్య, త్రివిక్రమ్, కల్యాణ్‌రామ్, మంచు మనోజ్ కార్లకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌నును పోలీసులు తొలగించి జరిమానా వేసిన సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి:
- తారక్ ట్రాఫిక్ చలానా చెల్లించిన అభిమాని.. కానీ ఓ వినతి
- ఎన్టీఆర్, బన్నీ తరహాలోనే మంచు మనోజ్... ఫైన్ విధించిన పోలీసులు
- Hero Nikhil: హీరో నిఖిల్ కారుకు చలానా విధించిన ట్రాఫిక్ పోలీసులు
- హీరోయిన్ తాప్సీకి ట్రాఫిక్ పోలీసుల జరిమానా
- ktr appreciates traffic police: తన వాహనానికి చలానా విధించిన పోలీసులపై కేటీఆర్ ప్రశంసలు