రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు నగర ట్రాఫిక్ పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నట్టు నగర ట్రాఫిక్ పోలీస్ డిప్యూటీ కమిషనర్ ఎల్ ఎస్ చౌహన్ అన్నారు. నగరంలో ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతా నియమాల పట్ల అవగాహన కల్పిస్తున్నట్టు ఆయన తెలిపారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నప్పుడు వాహనం నడుపుతున్న వ్యక్తితో పాటు.. వెనకాల కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని.. లేదంటే జరిమానా విధిస్తామని ఆయన వివరించారు. నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు చలానాలు విధిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు.
ట్రాఫిక్ నియమాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు తమ వంతుగా కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. గత కొంతకాలంగా నగరంలో ద్విచక్ర వాహనదారులు ప్రమాదానికి గురవుతున్న నేపథ్యంలో ద్విచక్ర వాహనంలో వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ప్రాణాలు కాపాడుకోవచ్చని తెలిపారు. గతంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించాలని పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు కల్పించామని ఆయన అన్నారు. దాదాపు 70 శాతం వరకు రోడ్డు ప్రమాదాలు ద్విచక్ర వాహనాల మూలంగా జరుగుతున్నట్లు, వెనక కూర్చున్నవారు ప్రమాదానికి గురై మరణిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నామని, ప్రజలు సహకరించాలని డీసీపీ చౌహన్ కోరారు.
ఇదీ చూడండి: కొత్త విద్యా విధానం... కొన్ని సవాళ్లు!