ద్విచక్రవాహనాల సైలెన్సర్లు మార్చి శబ్ద కాలుష్యానికి కారణమైతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్ కుమార్ హెచ్చరించారు. ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసినప్పుడు కంపెనీల నుంచి వచ్చే సైలెన్సర్లు మార్చి... ఎక్కువ శబ్దం వచ్చే వాటిని అమర్చుకుంటున్నారని... దీనివల్ల నిర్ధారించిన శబ్దం కంటే ఎక్కువ వెలువడి ఇబ్బందులు తలెత్తుతున్నాయని అనిల్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది ఆ తరహా వాహనాలపై ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.
జనవరిలో 1,134 వాహనాలను స్వాధీనం చేసుకొని... ద్విచక్ర వాహన యజమానులపై కేసులు నమోదు చేసినట్లు అనిల్ కుమార్ తెలిపారు. జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా వాహనదారులకు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో కేబీఆర్ పార్కు వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైలెన్సర్ మార్పు చేసిన ద్విచక్ర వాహనదారులకు అదనపు సీపీ అనిల్ కుమార్ కౌన్సిలింగ్ ఇచ్చారు.
ఇదీ చదవండి: వైఎస్ఆర్కు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది: నిమ్మగడ్డ