ప్రమాదాలలో గాయపడి ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు రక్తదాన శిబిరాలు ఎంతగానో తోడ్పడతాయని... హైదరాబాద్ నగర ట్రాఫిక్ అడిషనల్ సీపీ అనిల్ కుమార్ అన్నారు. నగర పోలీసులు, క్యాబ్ డ్రైవర్స్ యూనియన్, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ కార్ఖానాలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
శిబిరంలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేసిన క్యాబ్ డ్రైవర్లను అభినందించి... వారికి ధ్రువపత్రాలను అందజేశారు. ఇప్పటికే 300 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు ఆయన తెలిపారు. నగర పోలీసులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి అందులో క్యాబ్ డ్రైవర్లను భాగస్వామ్యం చేయడం శుభ పరిణామమని అన్నారు.
ఇదీ చదవండి: కిడ్నాప్ కేసు: భార్గవ్‌రామ్, జగత్‌విఖ్యాత్‌రెడ్డి సహా ఆరుగురికి బెయిల్