దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వ విధానాలు వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ప్రధాన కేంద్రాల్లో కార్మిక సంఘాలు నిరసన చేపట్టాయి. సమ్మె నేపథ్యంలో పోలీసుల ఆంక్షలు విధించారు. ఆర్టీసీ డిపోల పరిధిలో ఆందోళనకు అనుమతి నిషేధించారు. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
రక్షణ సంస్థల కార్పొరేటీకరణ, కార్మిక విధానాల్లో సంస్కరణలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది కార్మికులు, ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. సమ్మెకు మద్దతుగా 46 వేలమంది సింగరేణి కార్మికులు విధుల బహిష్కరించారు.
కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు నిరసన చేస్తున్నాయి. ప్రభుత్వ సంస్థలు, బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి.
ఇదీ చూడండి : దమ్ముంటే హైదరాబాద్లో సభ పెట్టండి: ప్రధానికి సవాల్