కాంగ్రెస్ కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రజలు ఆశీర్వదించకపోవచ్చు... కానీ భవిష్యత్లో పార్టీని పునర్నిర్మాణం చేసుకొని ముందుకు సాగుతామని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. రాబోయే కాలంలో ధైర్యంగా, ఐక్యంగా పోరాడుదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో పునర్నిర్మించుకుందామని ఆయన విజ్ఞప్తి చేశారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు తెరాస, భాజపాలకు వ్యతిరేకంగా ఓటు వేయాలనుకున్నదానికి నిదర్శనమే ఈ ఫలితాలన్నారు. భాజపా నాయకులు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నుంచి మొదలుకొని యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడణవీస్, స్మృతి ఇరానీ వంటి నాయకులను దించి హైదరాబాద్ గల్లీ గల్లీ తిరిగారని తెలిపారు.
90 పైగా సీట్లు వస్తే గెలిచినట్టు కానీ కొన్ని స్థానాలకే పరిమితమైనప్పటికీ భాజపా వాళ్ళు పండుగ జరుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు భాజపానీ తిరస్కరించారని నాయకులు గమనించాలని సూచించారు.
ఇదీ చదవండి: బల్దియాలో భాజపా జోరు... 2023 లక్ష్యంగా కమలనాథుల పావులు