Niranjan fires on BRS : తెలంగాణాలో గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాలపాటు పరిపాలించిన బీఆర్‌ఎస్, స్వేద పత్రం విడుదల చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఖండించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. స్వేద పత్రంలో పసలేదని ఆరోపించారు. రూ.50 లక్షల కోట్లు సంపద సృష్టించినట్లు చెప్పడం ఒక మిథ్యగా పేర్కొన్న నిరంజన్ దానిని ప్రజలు కూడా నమ్మడం లేదని ధ్వజమెత్తారు. అధికారం కోల్పోయినా, తమ పాలన సువర్ణ అధ్యాయమని, స్వర్ణయుగమని పేర్కొనడం సిగ్గు చేటని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే సబ్బండ వర్గాలకు మేలు : హనుమంతరావు
TPCC Leader Niranjan about BRS : తెలంగాణ కోసం కాంగ్రెస్ నాయకత్వంతో సుధీర్ఘ పోరాటం చేసి, పార్లమెంటులో(Parliament) తెలంగాణా బిల్లును పాస్ చేయించింది కాంగ్రెస్ నాయకులేనని నిరంజన్ పేర్కొన్నారు. తెలంగాణా అనే పదానికే అస్తిత్వం తెచ్చిపెట్టిన నాయకుడు కేసీఆర్ అని ఇంకా చెప్పుకోవడం కేటీఆర్ జ్ఞానానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ మాయ మాటలలో పడి రెండు సార్లు అధికారమిచ్చి అద్భుత అవకాశమిస్తే, బంధుప్రీతితో నిరంకుశ పాలన సాగించి పాలనను అవినీతిమయం చేశారని ఆరోపించారు.
'కేటీఆర్ ప్రవేశపెట్టిన స్వేద పత్రంలో అసలు ఏమీ లేదు. వారు అధికారం కోల్పోయిన తమ ప్రభుత్వ పాలన గొప్పదని చెప్పుకోవడం సిగ్గు చేటు. తెలంగాణ రాష్ట్రం కోసం కాంగ్రెస్ నాయకులు పోరాడారు. సోనియా గాంధీని ఒప్పించి పార్లమెంట్లో బిల్లును పాస్ చేయించాం. ప్రజలు కేసీఆర్‌కు రెండు సార్లు అవకాశమిచ్చినా నిరంకుశ పాలనతో అవినీతి చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు లోపాలు మీ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా బయటపడింది. మరెందుకు అప్పుడు దానిపై మరమ్మతులు చేపట్టలేదు.' - నిరంజన్ , కాంగ్రెస్ పార్టీ పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు
Congress Leader on kaleshwaram Project : త్యాగాలు, బలిదానాలు పోరాటాల ద్వారా తెలంగాణ తెచ్చుకున్నారనే విషయాన్ని మరిచిపోయి, ప్రజాస్వామ్యాన్ని మంట కలిపి రాచరిక పాలన(Monarchy) కొనసాగించారని బీఆర్ఎస్ను ఉద్దేశిస్తూ పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతం, మేడిగడ్డలో(Medigada) తప్పు జరిగితే సరి చేయండన్న కేటీఆర్ వ్యాఖ్యలకు బదులిచ్చిన నిరంజన్, అక్కడ పిల్లర్ కుంగుబాటు బయటపడిన రోజు అధికారంలో ఉన్నది బీఆర్‌ఎస్‌యే కదా? అని ప్రశ్నించారు. అప్పటికీ ఎన్నికల షెడ్యూల్ రాలేదు కదా అని గుర్తు చేశారు. దిద్దు బాటు చర్యలు ఎందుకు తీసుకోలేదని కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ ఆయన ప్రశ్నించారు.
దివ్యాంగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి : హరీశ్‌రావు
రేపు దిల్లీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క - ప్రధాని మోదీతో సమావేశమయ్యే ఛాన్స్