ఎత్తిపోతల పథకాల మీద లక్షల కోట్లు ఖర్చు చేస్తూ... గ్రావిటీ పథకాలను విస్మరిసున్నారని పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తాగు, సాగునీరు లేక సంగారెడ్డి ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారని... సమస్య తీరేవరకు వారి తరఫున కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తోందని తెలిపారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మంజీరా డ్యాం పరిశీలనకు కాంగ్రెస్ నాయకుల బృందం హైదరాబాద్ నుంచి బయలుదేరింది.
జలదీక్ష పేరుతో ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్తోన్న తమను అడ్డుకోవడమేంటని ఉత్తమ్ ప్రశ్నించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో చినజీయర్ స్వామితో కలిసి పదివేల మందితో సీఎం కొండపోచమ్మ ప్రాజెక్టును ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. మంత్రులు ఎమ్మెల్యేలు జిల్లాల పర్యటనలకు పోలీసులు ఎలా అనుమతి ఇచ్చారని నిలదీశారు.
రూ.1012 కోట్లు ఖర్చు చేస్తే 4 లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఆరేళ్లుగా ఎస్‌ఎల్‌బీసీ పనులు ఎందుకు పూర్తి చేయలేదు. కాళేశ్వరం జలాలతో సింగూరు ప్రాజెక్టు నింపుతానని గతంలో కేసీఆర్ అన్నారు. 30 టీఎంసీల సామర్థ్యం ఉన్న సింగూరును నింపితే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. - ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ ఛీఫ్
ఇదీ చూడండి: 'మార్కెట్లో అమ్ముడుపోయే పంటలే పండించాలి'