ETV Bharat / state

'ఆదాయానికి... బడ్జెట్​ అచనాలకు పొంతన లేదు'

విద్యుత్తు ఛార్జీలు, ఆస్తిపన్నులు పెంచడాన్ని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ ఖండించింది. కేసీఆర్‌ ప్రభుత్వం మొదటి నుంచి ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తంగా నిర్వహిస్తోందని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి ఆరోపించారు.

guduru narayanareddy Criticism on government
'ఆదాయానికి... బడ్జెట్​ అచనాలకు పొంతన లేదు'
author img

By

Published : Mar 13, 2020, 9:40 PM IST

వాస్తవ ఆదాయాలకు, రాష్ట్ర బడ్జెట్‌ అంచనాలకు పొంతన లేదని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి ఆరోపించారు. అస్తవ్యస్తంగా మారిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు చర్యలు తీసుకోకుండా... రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని విమర్శించారు. ఆర్థిక మాంద్యం మాటున విద్యుత్తు ఛార్జీలు, ఆస్తి పన్నులు పెంచి... పేద, మధ్య తరగతి ప్రజలపై భారాన్ని వేయడం ఏంటని నిలదీశారు.

ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో లక్షా 82వేల కోట్లు వాస్తవ రహిత బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే సమీక్షించి, సామాన్యులపై అదనపు భారం పడకుండా వాస్తవిక విధానాన్ని అవలంభించాలని గూడూరు నారాయణ రెడ్డి డిమాండ్‌ చేశారు.

ఇదీ చూడండి:పన్నులు, విద్యుత్‌ ఛార్జీలు పెంచుతాం: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.