11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కుల కు పెంచితేనే వ్యతిరేకించాం. ఇప్పుడు 44 వేల క్యూసెక్కుల నుంచి 88వేలకు పెంచితే ఊరుకుంటామా. ఇదే జరిగితే దక్షిణ తెలంగాణ ఎడారి అవుతుంది. ఎపీ ఇప్పటికే కృష్ణా నుంచి ఎక్కువ నీరు తీసుకుపోతుంది. లక్షల కోట్ల దోపిడీకి కేసీఆర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. రిటైర్డ్ అయిన వ్యక్తికి కీలకమైన ఇరిగేషన్ బాధ్యతలు ఏంటీ ? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును రెండు టీఏంసీల నుంచి 1 టీఏంసీకి ఎందుకు మరళీధర్ రావు తగ్గించారు. మరళీధర్ రావుపై చర్యలు తీసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ రైతుల కోసం కాదు.. వీళ్ల జేబులు నింపుకోవడానికి. లాక్ డౌన్ సమయంలో కేసీఆర్ చీకటి ఓప్పందాలు చేసుకుంటున్నారు. రెండు టీఏంసీల కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టారు. మరో వైపు జగన్ నాలుగు టీఏంసీల నీరు తీసుకెళ్తున్నా కేసీఆర్ పట్టించుకోవట్లేదు. పోతిరెడ్డిపాడుపై కాంగ్రెస్ ఎంతటి పోరాటానికైనా సిద్ధం. ప్రధానమంత్రిని, కేంద్ర జలవనరుల మంత్రిని కలుస్తాం.
-ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
ఇదీ చూడండి: కరోనాను అడ్డుపెట్టుకొని 9వేల సైబర్ దాడులు