ETV Bharat / state

REVANTH REDDY: సీబీఐని కలిసిన రేవంత్​.. కోకాపేట్, ఖానామెట్‌ భూముల అమ్మకాలపై ఫిర్యాదు

కోకాపేట్​, ఖానామెట్​ భూముల అమ్మకాలపై సీబీఐ విచారణ జరిపించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు దిల్లీలో సీబీఐ డైరెక్టర్​ను ఆయన కలిశారు. భూముల అమ్మకాల్లో అక్రమాలు జరిగాయని ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

revanth reddy
సీబీఐని కలిసిన రేవంత్​
author img

By

Published : Sep 9, 2021, 1:00 PM IST

కోకాపేట్‌, ఖానామెట్‌ భూముల అమ్మకాల్లో అక్రమాలు జరిగాయని.. వాటిపై సీబీఐ విచారణ జరిపించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు దిల్లీలో సీబీఐ డైరెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశానని రేవంత్‌ తెలిపారు. రాష్ట్ర ఖజానాకు రూ. వెయ్యి నుంచి 1,500 కోట్ల నష్టం జరిగిందని రేవంత్​ ఆరోపించారు.

రాహుల్‌ గాంధీతో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ దోపిడీని వివరించామని రేవంత్​ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం మేరకే సీబీఐ విచారణ జరిపించాలని ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. అవినీతి సంపదతో ఎన్నికల ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారని రేవంత్​రెడ్డి మండిపడ్డారు.

కోకాపేట్​, ఖానామెట్​ భూముల టెండర్లలో గోల్​మాల్​ జరిగింది. దీనికి సహకరించిన అందరిపైన రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాను. భాజపా, తెరాస కుమ్మక్కయ్యాయి అనేది నిజం కాకపోతే.. భూముల అమ్మకాలపై సీబీఐ చేత విచారణ జరిపించి.. చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.

-రేవంత్​ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

భాజపా చిత్తశుద్ధి నిరూపించుకోవాలి..

టెండర్లు ఏవైనా ఈ ప్రొక్యూర్‌మెంట్‌ విధానం ద్వారానే పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని రేవంత్​ గుర్తుచేశారు. కానీ కోకాపేట్‌ భూముల అమ్మకాలకు కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌ను ఎందుకు వాడుకుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అనుయాయులు, కావాల్సిన వాళ్లకు కోకాపేట్‌, ఖానామెట్‌ భూములు కట్టబెట్టారని ఆదేశించారు. విచారణకు ఆదేశించి కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని రేవంత్‌రెడ్డి హితవు పలికారు. ప్రధానితో పాటు హోం శాఖకు కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. డ్రగ్స్‌ కేసు విచారణ జరుగుతున్నందున సీబీఐ ముందు ఆ అంశం ప్రస్తావించలేదని వివరించారు.

కోకాపేట్, ఖానామెట్‌ భూముల అమ్మకాలపై రేవంత్​ ఫిర్యాదు

ఇదీ చదవండి: HIGH COURT: గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.