TPCC Political Affairs Committee meeting at Gandhi Bhavan : గాంధీభవన్‌లో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ముగిసింది. 5 అంశాల ఎజెండాగా సాగిన పీఏసీ సమావేశంలో ఎన్నికల ఫలితాలు, 6 గ్యారంటీల అమలు, నామినేటెడ్ పోస్టులు, పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సీట్లు తగ్గడంపైనా సమాలోచనలు చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి పీఏసీ సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సర్కార్ ఫోకస్ - శాసనసభ వేదికగా లెక్కతేల్చేందుకు సిద్ధం
కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్‌రావు ఠాక్రే అధ్యక్షతన కొనసాగిన ఈ సమావేశంలో పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఏఐసీసీ అగ్ర నేత సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని పీఏసీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. దీంతో పాటు గ్రామ సభలు పెట్టి అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇస్తామని, వంద రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని తీర్మానించింది. అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపింది. తెలంగాణ కాంగ్రెస్ గెలుపునకు కృషి చేసిన ఏఐసీసీ నేతలకు ధన్యవాదాలు తెలిపింది.
కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తి వివరాలు అందించాలి : సీఎం రేవంత్ రెడ్డి
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చాలా కష్టపడ్డారని మాణిక్‌రావు ఠాక్రే అభినందించారు. తమ పార్టీ విధానాలను, హామీలను ప్రజలు పూర్తిగా విశ్వసించారని హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కి తెలంగాణలో మంచి విజయం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఈ క్రమంలోనే రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని సూచించారు. మంచి విజయాలు అందేలా మనం కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చాలా కష్టపడ్డారు. కాంగ్రెస్ పార్టీ విధానాలను, హామీలను ప్రజలు పూర్తిగా విశ్వసించారు. పార్టీకి తెలంగాణలో మంచి విజయం కల్పించారు. వారికి ధన్యవాదాలు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై పార్టీ పూర్తిస్థాయిలో దృష్టి సారించాలి. మంచి విజయాలు అందేలా మనం కష్టపడి పని చేయాలి. - మాణిక్‌రావ్ ఠాక్రే, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జీ
త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ - వారికి ఛాన్స్ దక్కుతుందా?
అంతకుముందు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి, సంపూర్ణ మద్దతు పలికిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలు, నాయకులు, ఏఐసీసీ అగ్ర నేతలు, ప్రచారంలో పాల్గొన్న నాయకులు, ఇంఛార్జ్‌లుగా పని చేసిన ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్ ధన్యవాదాలు చెబుతూ తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని సమావేశంలో ఏకగ్రీగంగా ఆమోదించారు.
యాసంగి పంటకు నీటి విడుదల, మేడిగడ్డ అంశాలపై పూర్తి వివరాలు ఇవ్వండి : సీఎం రేవంత్ రెడ్డి