ETV Bharat / state

మర్రి శశిధర్‌రెడ్డిని కాంగ్రెస్ నుంచి బహిష్కరించిన టీపీసీసీ - Marri Shasidhar Reddy latest news

Marri Sasidhar Reddy
మర్రి శశిధర్‌రెడ్డి
author img

By

Published : Nov 19, 2022, 5:16 PM IST

Updated : Nov 19, 2022, 7:12 PM IST

17:05 November 19

ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించిన కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ

Congress Expels Shashidhar Reddy: మర్రి శశిధర్‌రెడ్డిని కాంగ్రెస్ నుంచి టీపీసీసీ బహిష్కరించింది. ఆరేళ్ల పాటు పార్టీ నుంచి కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ సస్పండ్​ చేసింది. నిన్న దిల్లీలో అమిత్‌ షాను కలిసిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఓ ప్రకటన చేసింది.

అసలేం జరిగిదంటే: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి పార్టీ మారుతారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నిన్న ఆయన.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో భేటీ కావడం చర్చనీయాంశమైంది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో కలిసి ఆయన అమిత్‌ షాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పరిణామాలపై నేతలు అమిత్‌ షాతో చర్చించారు. మర్రి శశిధర్‌రెడ్డి వారం రోజుల్లో భాజపాలో చేరే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయంపై మర్రి శశిధర్‌రెడ్డి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 19, 2022, 7:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.