ప్రధాన మంత్రిగా పీవీ నరసింహరావు చేపట్టిన ఆర్థిక సంస్కరణలు.. దేశాన్ని ప్రగతిపథంలో నడిపాయని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. గాంధీభవన్‌లో పీవీ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి దేశానికే ప్రధానిగా ఎదిగిన పీవీ తెలుగువారికి గర్వకారణమని ఉత్తమ్ కొనియాడారు. రాజనీతిజ్ఞుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయన దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు. అంతటి గొప్ప వ్యక్తి శత జయంతి సందర్భంగా ప్రభుత్వం ఏడాది పాటు వేడుకలు నిర్వహించడాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీవీని ఆదర్శంగా తీసుకుని పాలన సాగించాలని అన్నారు.
ఉత్తమ్‌తో పాటు ఎమ్యెల్యే శ్రీధర్ బాబు, పీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి చిన్నా రెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, మాజీ ఎంపీలు అంజన్‌కుమార్ యాదవ్, మల్లు రవి తదితరులు పీవీ చిత్రపటం వద్ద పుష్ప గుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు.
ఇదీచూడండి: పీవీ జీవితం: సాధారణ ఎన్నికల్లో ఓటమి నుంచి దేశ ప్రధానిగా...