కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం కార్పొరేట్ ప్రభుత్వంగా మారిపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో తెరాస ప్రభుత్వాలు ప్రజలను మోసం చేసి, కోట్ల అవినీతికి పాల్పడుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీభవన్‌లో పార్టీ జెండా ఎగురవేసిన ఉత్తమ్.. పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశం, ఈ ప్రజలు, ఈ మట్టి కోసం పని చేస్తుందని ఉత్తమ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పల్లె పల్లెలో కాంగ్రెస్ జెండా ఉందని.. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి గీతారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్, ఎమ్యెల్యే జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'ఆకలి దప్పులు ఉన్నంత వరకు కమ్యూనిజం బతికే ఉంటుంది'