ETV Bharat / state

ఉద్యోగాల విషయంలో తెరాసకు చిత్తశుద్ధి లేదు: ఉత్తమ్​ - గాంధీభవన్ వార్తలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేశాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఆరోపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఆయన సూచించారు. భాజపా, తెరాసలు రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. హైదరాబాద్​లోని గాంధీ భవన్​లో టీపీసీసీ అనుబంధ సంఘాలతో ఆయన సమావేశమయ్యారు.

tpcc chief uttam kumar reddy
ఉద్యోగాల విషయంలో తెరాసకు చిత్తశుద్ధి లేదు : ఉత్తమ్​
author img

By

Published : Feb 28, 2021, 5:30 PM IST

తెరాస, భాజపాలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ ​కుమార్​ రెడ్డి పట్టభద్రులకు సూచించారు. హైదరాబాద్​లోని గాంధీ భవన్​లో టీపీసీసీ అనుబంధ సంఘాలతో ఆయన సమావేశమయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శాండ్​, లాండ్​, మైన్స్​, వైన్స్​ వ్యాపారాలే తెరాస నాయకులు లక్ష్యమని విమర్శించారు. ప్రజాసంక్షేమం గాలికొదిలేశారని అన్నారు.

రాష్ట్రంలో తెరాస పతనం మొదలైందని ఉత్తమ్ ​కుమార్​ రెడ్డి అన్నారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన జోస్యం చెప్పారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలంగా ఉందని..​ టీపీసీసీ అనుబంధ సంఘాల వ్యవస్థ పటిష్టంగా ఉందన్నారు. కొంతమంది స్వార్థపరులు మాత్రమే పార్టీని వీడుతున్నారని.. ఇది చాలా దుర్మార్గమైన చర్యగా అభిప్రాయపడ్డారు.

భాజపాతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు: ఉత్తమ్​ కుమార్​ రెడ్డి

కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేళ్లయినా దేశానికీ, రాష్ట్రానికి ఏం చేశారని ఉత్తమ్ ​కుమార్​ రెడ్డి ప్రశ్నించారు. భాజపా వల్లే తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందని ఆరోపించారు. యూపీఏ హయాంలో ఇచ్చిన ఐటీఐఆర్​ను అమలు చేయలేకపోయాయని విమర్శించారు. దీని వల్ల లక్షల మందికి రావాల్సిన ఉద్యోగాలు పోయాయని ధ్వజమెత్తారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను నియంత్రించడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్​యూఐ అధ్యక్షులు బలమూరి వెంకట్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనా రెడ్డి, ఎస్సీ విభాగం అధ్యక్షుడు ప్రీతమ్, మైనారిటీ అధ్యక్షుడు అబ్దుల్ సోహైల్, ఎన్నారై విభాగం ఛైర్మన్ వినోద్, ఎస్టీ విభాగం ఛైర్మన్ జగన్ లాల్ నాయక్, ఫిషర్​మెన్​ ఛైర్మన్ మెట్టుసాయి కుమార్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి : తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి: ఎంపీ రేవంత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.